రాహుల్ గాంధీ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తో కలిసి కూర్చున్న వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఇద్దరూ కలిగి భోజ్‌పురి పాటను ఆస్వాదిస్తున్నారని.. ఆ వీడియో భారత్ జోడో యాత్రకు సంబంధించినదని ప్రచారం జరుగుతోంది.
"Rahul Gandhi with Rajasthan CM refreshing at night after padhayatra in Bharat jodo campaign (sic)." అంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు. పాదయాత్ర తర్వాత ఇలా ఎంజాయ్ చేశారంటూ పోస్టులు వైరల్ చేస్తూ ఉన్నారు.
నిజ నిర్ధారణ :
NewsMeter బృందం ఇందుకు సంబంధించి ఒక కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించింది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 100 రోజులను పురస్కరించుకుని డిసెంబర్ 16న జైపూర్‌లో ఒక సంగీత కచేరీని నిర్వహించినట్లు కనుగొన్నాం. రాహుల్ గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఇతర కాంగ్రెస్ నాయకులు హాజరైన ఈ కార్యక్రమంలో నేపథ్య గాయని సునిధి చౌహాన్, ఇతర గాయకులు ప్రదర్శన ఇచ్చారు.
డిసెంబర్ 16న, భారత్ జోడో యాత్ర అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో పాదయాత్ర 100 రోజుల వేడుకకు సంబంధించిన ఫోటోలను ట్వీట్ చేసింది.
మేము వీడియో కీఫ్రేమ్స్ ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. అదే వీడియోని జర్నలిస్ట్ అఖిలేష్ తివారీ ట్వీట్ చేయడాన్ని చేసాము. ఈ వీడియోలో, సునిధి చౌహాన్ 2005 చిత్రం 'బ్లఫ్‌మాస్టర్' సినిమా లోని "రైట్ హియర్ రైట్ నౌ" అనే ప్రసిద్ధ బాలీవుడ్ పాటను పాడింది. "ఏక్ మై ఔర్ ఏక్ తూ హై, ఔర్ హవా మే జాదూ హై" అనే లిరిక్స్ పాడుతూ ఉండగా ఈ వీడియోను తీశారు.
ఇదే వీడియోను పలువురు ట్విట్టర్ యూజర్లు పోస్ట్ చేశారు.
మేము YouTubeలో ఈ ఈవెంట్ కు సంబంధించి 30 నిమిషాల వీడియోను కనుగొన్నాము. ఈ వీడియోలో, కచేరీ సమయంలో భోజ్‌పురి పాటలు ప్లే చేసినట్లు మాకు కనిపించలేదు. 14.16 నిమిషాల సమయంలో, సునిధి చౌహాన్ బాలీవుడ్ పాట పాడటం వినవచ్చు.
ఒరిజినల్ వీడియోకు భోజ్ పురీ పాటను ఎడిట్ చేసి వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.