బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కొత్త చిత్రం 'పఠాన్' ట్రైలర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ వీక్షించి, చప్పట్లు కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.
ఒక ట్విటర్ వినియోగదారు వీడియోను షేర్ చేసి.. గౌరవనీయులైన ప్రధాన మంత్రి పఠాన్ సినిమా ట్రైలర్ ను చూశారని పోస్టులు పెట్టాడు.
“Hounarable PM @narendramodi ji watching the #Trailer of #Pathaan in PM office…” అంటూ పోస్టు పెట్టి.. సినిమాకు సంబంధించిన పలు హ్యాష్ ట్యాగ్ లను ఉంచారు.
అనేక ఇతర ట్విట్టర్ వినియోగదారులు అదే దావాతో వీడియోను పంచుకున్నారు.
న్యూఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ప్రధానమంత్రి మోదీ సినిమాలు, పలువురు వ్యక్తులపై అనవసరమైన వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని బీజేపీ నేతలకు సూచించిన తర్వాత ఈ వాదన వచ్చింది.
నిజ నిర్ధారణ :
వీడియో ఎడిట్ చేశారని న్యూస్‌మీటర్ కనుగొంది. ఒరిజినల్ వీడియోలో చంద్రయాన్-2 ప్రయోగాన్ని ప్రధాని మోదీ వీక్షిస్తున్నట్లు కనిపిస్తోంది.
వీడియో కీఫ్రేమ్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను నిర్వహించగా.. 22 జూలై 2019న వార్తా సంస్థ ANI ట్వీట్ చేసిన వీడియోను గుర్తించాం. అందులో నిడివి ఎక్కువ వీడియో ఉండడాన్ని గుర్తించాం. ఈ వీడియోలో వైరల్ వీడియోలో చూసినట్లుగానే అదే వేషధారణలో ప్రధాని మోదీ ఉన్నట్లు మేము గుర్తించాం. ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగానికి సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాన్ని తాను చూస్తున్నట్లు మోదీ పేర్కొన్నట్లు కూడా తెలిసింది.
22 జూలై 2019న, హిందుస్థాన్ టైమ్స్ తన యూట్యూబ్ ఛానెల్‌లో అదే వీడియోను అప్లోడ్ చేసింది. “చంద్రయాన్-2 ప్రయోగం: ప్రధాని మోదీ లిఫ్ట్-ఆఫ్‌ను వీక్షించారు”( “Chandrayaan-2 launch: PM Modi watches lift-off.”) అనే టైటిల్‌తో ఈ వీడియో ఉంది. వైరల్ వీడియోలో చూసినట్లుగానే ప్రధాని మోదీ అదే వేషధారణలో కనిపిస్తారు. చంద్రయాన్-2 లాంచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని మోదీ వీక్షించారు.
22 జూలై 2019న, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రయాన్-2 మిషన్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుండి ప్రారంభించింది.
భారతదేశం చేపట్టిన ప్రతిష్టాత్మక మిషన్ ను ప్రధాని మోదీ వీక్షించారని NDTV, DNA మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి.
షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమా ట్రైలర్‌ని ప్రధాని మోదీ వీక్షిస్తున్న వీడియో వైరల్ ఎడిట్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి, వీడియో ప్రజలను తప్పుదారి పట్టించేదిగా ఉందని మేము నిర్ధారించాము.