ఎలోన్ మస్క్ 'షిలాజిత్'ని గొప్ప విషయంగా ఆమోదించిన వీడియో వైరల్ గా మారింది.
ఇటీవల, ఎలోన్ మస్క్ కు చెందిన వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో మస్క్ షిలాజిత్‌ను యాంటీ ఏజింగ్, హెయిర్-రిస్టోర్, రివైటలింగ్ రెమెడీగా ఆమోదించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వైరల్ వీడియోలో ఎలోన్ మస్క్ మాట్లాడుతూ “షిలాజిత్ యాంటీ ఏజింగ్ రెమెడీ, జుట్టు రాలడం తగ్గిస్తుంది, మన శరీరానికి అత్యంత శక్తివంతమైన వనరుగా భావిస్తూ ఉన్నాం. నేను నాచురల్ రెమ్స్ అనే కంపెనీ నుండి దీనిని పొందాను. అది నిజంగా అద్భుతం." అంటూ చెప్పడాన్ని గమనించవచ్చు.
మరొక వీడియోలో, “సమస్య ఏమిటంటే మీరు డిప్రెషన్‌లో ఉన్నారు. మీరు సంతోషకరమైన జీవనశైలిని గడపలేకపోతున్నందుకు మీరు నిరాశకు లోనయ్యారు. మీరు ఇష్టం వచ్చినట్లు తింటారు, సరిగా నిద్రపోరు. సరైన శక్తి మీకు లేదు. అయితే నేచురల్ రెమ్స్ నుండి షిలాజిత్ అనే ఈ సప్లిమెంట్‌తో వాటన్నింటినీ పరిష్కరించడానికి ఒక మార్గంగా ఉందని నేను మీకు చెబితే? నమ్ముతారా" అని అన్నట్లు అందులో ఉంది.
ఇది నిజమేనా కాదా.. అన్నది తెలుసుకుందాం.
నిజ నిర్ధారణ :
న్యూస్‌మీటర్ వైరల్ క్లెయిమ్ లో నిజం లేదని కనుగొంది. వైరల్ వీడియో వాయిస్ క్లోనింగ్‌ని ఉపయోగించి రూపొందించారని గుర్తించింది.
మేము InVid సాధనం నుండి సంగ్రహించబడిన కీఫ్రేమ్‌లను ఉపయోగించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను అమలు చేసాము. YouTube ఛానెల్ TEDలో వీడియో పూర్తి వెర్షన్‌ను కనుగొన్నాము. "ఎలోన్ మస్క్ ట్విట్టర్, టెస్లా గురించి మాట్లాడారు. TED2022లో 14 ఏప్రిల్ 2022 తేదీన ప్రత్యక్ష ప్రసారం చేశారు.
మొత్తం 54.45 నిమిషాల వీడియోను జాగ్రత్తగా విశ్లేషించిన తర్వాత, వైరల్ వీడియోలో ఇందులో ఉందని మేము కనుగొన్నాము. వైరల్ వీడియోలో ఉపయోగించిన 10 సెకన్ల క్లిప్‌ను 13.20 నిమిషాల మార్క్‌లో చూడవచ్చు.
కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. ఈ వీడియోను ఎడిట్ చేశారు.
Credits : Sunanda Naik