FactCheck : ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోలో అరవింద్ కేజ్రీవాల్ కు మద్దతుగా ప్రజలు నినాదాలు చేశారా..?

Doctored video shows crowd chanting 'Kejriwal' at Modi's Surat roadshow. గుజరాత్ ఎన్నికల సందర్భంగా గురువారం అహ్మదాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం నిర్వహించారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Dec 2022 2:07 PM GMT
FactCheck : ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోలో అరవింద్ కేజ్రీవాల్ కు మద్దతుగా ప్రజలు నినాదాలు చేశారా..?

గుజరాత్ ఎన్నికల సందర్భంగా గురువారం అహ్మదాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం నిర్వహించారు. నరోదా గామ్‌ నుంచి ఓపెన్ రూఫ్ వాహనంలో మోదీ రోడ్‌షోను ప్రారంభించారు. అహ్మదాబాద్ నగరంలోని 16 నియోజకవర్గాలలో 12 నియోజకవర్గాల గుండా వెళ్ళింది. నరోడా, ఠక్కర్‌బాపానగర్, బాపునగర్, నికోల్, అమ్రైవాడి, మణినగర్, డానిలింబ్డా, జమాల్‌పూర్ ఖాడియా, ఎలిస్‌బ్రిడ్జ్, వేజల్‌పూర్, ఘట్లోడియా, నారన్‌పూర్, సబర్మతి, గాంధీనగర్ సౌత్ మీదుగా మోదీ రోడ్‌షో సాగింది. మోదీ మెగా రోడ్‌ షో దాదాపు 50 కిలోమీటర్లు సాగింది. ఇంత సుదీర్ఘ రోడ్‌ షో నిర్వహించిన నేతగా మోదీ సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ రోడ్ షోలో వేలాది మంది భాజపా కార్యకర్తలు, అభిమానులు

గుజరాత్‌లోని సూరత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్‌షో సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు అనుకూలంగా నినాదాలు చేశారంటూ సోషల్ మీడియా వినియోగదారులు వీడియోను షేర్ చేస్తున్నారు. గుజరాత్‌లోని సూరత్‌లో ప్రధాని మోదీ రోడ్‌షో సందర్భంగా కేజ్రీవాల్ అనుకూల నినాదాలు లేవనెత్తిన వీడియోను ఉత్తరప్రదేశ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంశరాజ్ దూబే షేర్ చేశారు.


ఆప్ నేతలు గులాబ్ సింగ్ యాదవ్, పంకజ్ సింగ్, ఇతరులు ఇదే వాదనతో వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

నిజ నిర్ధారణ :

NewsMeter ట్విట్టర్‌లో కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించింది. అదే వైరల్ క్లిప్‌ను కనుగొనింది, కానీ ప్రధాని నరేంద్ర మోదీకి అనుకూలంగా నినాదాలు ఉన్నాయి. ఒక వినియోగదారు క్లిప్‌ను షేర్ చేసి, "మోదీ"...మోదీ" అని నినాదాలు చేస్తున్నారు... సూరత్‌లో ప్రధాని మోడీ రోడ్‌షోలో..." అని ట్వీట్ చేశారు.

ఆజ్ తక్ ప్రచురించిన అదే క్లిప్‌ను మేము కనుగొన్నాము. క్యాప్షన్ ప్రకారం, ఇది సూరత్‌లో ప్రధాని మోదీ హుంకార్ ర్యాలీకి సంబంధించినది . ఈ క్లిప్‌లో కూడా మాకు ప్రధాని మోదీకి అనుకూలంగా నినాదాలు ఉన్నట్లు గుర్తించాం.

నవంబర్ 27న ప్రధాని మోదీ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో ప్రసారం చేసిన రోడ్‌షో ప్రత్యక్ష ప్రసారాన్ని మేము తనిఖీ చేసాము. దాదాపు 1.15 గంటల పాటు ఉన్న ఈ వీడియోలో ఏ సమయంలోనూ కేజ్రీవాల్ అనుకూల నినాదాలు వినిపించలేదు. కానీ మేము ప్రధాని మోదీకి అనుకూలంగా నినాదాలు ఉండడం చూశాం.

ఇండియా టుడే కూడా రోడ్‌షోని ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఈ వీడియోలో కేజ్రీవాల్ అనుకూల నినాదాలు మాకు కనిపించలేదు.

కేజ్రీవాల్ అనుకూల నినాదాలతో కూడిన వైరల్ క్లిప్ డిజిటల్‌గా నినాదాలను చొప్పించడం ద్వారా ఎడిట్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి, ప్రధాని మోదీ ర్యాలీలో కేజ్రీవాల్ అనుకూల నినాదాలు లేవనెత్తిన వాదన తప్పు అని మేము నిర్ధారించాము.


Claim Review:ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోలో అరవింద్ కేజ్రీవాల్ కు మద్దతుగా ప్రజలు నినాదాలు చేశారా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media Users
Claim Fact Check:False
Next Story