తుర్క్మెనిస్తాన్లోని పౌరులకు 1991 నుండి నీరు, గ్యాస్, విద్యుత్ ను ఉచితంగా అందిస్తున్నట్లు అనేక మంది సోషల్ మీడియా యూజర్లు పోస్టులను వైరల్ చేస్తూ ఉన్నారు.
"తుర్క్మెనిస్తాన్లో 1991 నుండి నీరు, గ్యాస్, విద్యుత్ ఉచితం" అని ఆ పోస్టుల్లో ఉంది.
ఈ ఉచిత నిబంధన ప్రస్తుతం ఆ దేశంలో ఇంకా ఉందని సోషల్ మీడియా వినియోగదారులు భావిస్తున్నారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న ఈ పోస్టు ప్రజలను తప్పుద్రోవ పట్టించే దిశగా ఉంది.
తుర్క్మెనిస్తాన్ ప్రభుత్వం తన పౌరులకు గతంలో ఉచిత నీరు, గ్యాస్ మరియు విద్యుత్తును అందించిందని గమనించాలి. అయితే, ఇది 1991 లో ప్రారంభం కాలేదు. ఈ నిబంధన 1993 లో ప్రారంభమైంది.. కానీ ప్రస్తుతం అమలులో లేదు.
1993 నుండి తుర్క్మెనిస్తాన్ ప్రజలు నీరు, సహజ వాయువు, విద్యుత్తును ఉచితంగా పొందారు. తుర్క్మెనిస్తాన్ మొదటి అధ్యక్షుడు సపర్మురత్ నియాజోవ్ దీనిని పదేళ్లపాటు ప్రవేశపెట్టి 2030 వరకు పొడిగించారు సోవియట్ యూనియన్ నుండి స్వాతంత్ర్యం పొందిన ఈ ఇంధన సంపన్న దేశం.. కొద్దికాలానికే 1993 లో నియాజోవ్ ఉచితంగా నీరు, గ్యాస్, విద్యుత్ ఇస్తామని చెప్పుకొచ్చారు.
ఏదేమైనా 2014 నుండి ఇంధన ధరల తగ్గుదల మొదలవుతూ ఉండడంతో దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. ఈ ఉచితాలకు స్వస్తి చెప్పాలని ఆ దేశ ప్రభుత్వం భావించింది.
తుర్క్మెనిస్తాన్ తన సహజ వనరులను హేతుబద్ధంగా ఉపయోగించుకోవటానికి, స్వేచ్ఛా మార్కెట్ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడంలో సహాయపడటానికి ఉచిత నీరు, గ్యాస్, విద్యుత్తును ఆపే ఆలోచనను అధ్యక్షుడు గుర్బాంగూలీ బెర్డిముఖమదేవ్ తీసుకువచ్చారు. ఉచిత గ్యాస్, నీరు, విద్యుత్ సదుపాయం 2019 లో ముగిసింది. 2018 లో బెర్డిముఖమదేవ్ ఈ ఉచిత సహజ వాయువు, విద్యుత్తును ఆపేయాలని ఆదేశించారు. "గ్యాస్, నీరు, విద్యుత్, గృహనిర్మాణం, మతపరమైన సేవలు, రవాణా మరియు సమాచార మార్పిడి కోసం చెల్లింపులను ఆదేశిస్తూ నేను చట్టంపై సంతకం చేస్తున్నాను" అని అధ్యక్షుడు గుర్బాంగూలీ బెర్డిముఖమెడోవ్ చెప్పారు.
అధ్యక్షుడు గుర్బాంగూలీ బెర్డిముహామెడోవ్ సంతకం చేసిన ఉత్తర్వులను అనుసరించి, జనవరి 1, 2019 న తుర్క్మెనిస్తాన్ తన పౌరులకు ఉచిత తాగునీరు, గ్యాస్ మరియు విద్యుత్తును అందించడం మానేసింది. ప్రస్తుతం దేశం తన పౌరులకు అలాంటి నిబంధనలను అందించడం లేదని ఇది స్పష్టం చేస్తుంది.
ప్రస్తుతం దేశంలో ఉచిత నిబంధనలు లేవని స్పష్టంగా తెలుస్తుంది.
దీన్ని బట్టి ఈ కథనాలు ప్రజలను తప్పుదారి పట్టించేవిలా ఉన్నాయి.