FactCheck : మ్యాజిక్ నిండిన రాళ్లు.. మేకులను కరిగిపోయేలా చేయగలవా..?

Do These Magical Stones Melt Metal Nails. ఓ నల్ల రాయిపై ఇనుప మేకులను పెడితే కరిగిపోయినట్లుగా ఉన్న వీడియో ఒకటి సోషల్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Dec 2021 11:07 AM GMT
FactCheck : మ్యాజిక్ నిండిన రాళ్లు.. మేకులను కరిగిపోయేలా చేయగలవా..?

ఓ నల్ల రాయిపై ఇనుప మేకులను పెడితే కరిగిపోయినట్లుగా ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ రాయి ఆఫ్ఘనిస్తాన్‌కు చెందినదని, ఇది ప్రకృతిలో "మాయ" అని చెబుతూ ఉన్నారు. రాయి చల్లగా ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నా.. వాటిపై ఉంచిన ఉక్కు, ఇనుముతో చేసిన వస్తువులు కరిగిపోతూ ఉన్నాయి.

సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు: "ఆఫ్ఘనిస్తాన్‌లోని వార్దక్ ప్రావిన్స్‌లో ఒక రాయి కనుగొనబడింది, ఇది పై నుండి చల్లగా ఉంటుంది, కానీ పైన ఉక్కు లేదా ఇనుము ఉంచినట్లయితే అది కరిగిపోతుంది. అది ఏ రాయి కావచ్చు?" అంటూ నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉన్నారు.

నిజ నిర్ధారణ :

NewsMeter రివర్స్ ఇమేజ్ శోధనను నిర్వహించింది. masralyoum.net అనే వెబ్‌సైట్‌లో ఇందుకు సంబంధించిన కథనాన్ని కనుగొంది. ఇది జెడ్డా ఖగోళ శాస్త్ర సొసైటీ వ్యవస్థాపకుడు M. మాజిద్ అబూ జహ్రా గురించి ప్రస్తావించింది. ఆయన మేకులు కరిగిపోవడానికి శాస్త్రీయ వివరణను ముందుకు తెచ్చాడు. మేకులు 29ºC (85.6°F) తక్కువ ద్రవీభవన స్థానం కలిగి ఉండే గాలియం అనే లోహంతో తయారవుతాయని, వాటిని తాకినప్పుడు ఇనుప మేకులు ఎందుకు సులభంగా కరుగుతాయో వివరించారు.

నవంబర్ 27, 2021 నాటి కథనంలోని ఫేస్‌బుక్ పోస్ట్‌లో సూర్యరశ్మి కారణంగా వెచ్చని ఉపరితలంపై ఉంచినప్పుడు గాలియంను సులభంగా కరిగిస్తుందని పేర్కొంది.

https://www.facebook.com/groups/astronomyjas/posts/10158779373349001/

గాలియం అనేది ఒక మృదువైనది. ఇది ఎలక్ట్రానిక్ సర్క్యూట్‌లలో ఎక్కువగా ఉపయోగించబడుతుంది. ఇది కరగడం కూడా సులభం, ఎందుకంటే గాలియం 29 డిగ్రీల C (85.6 ° F) ఉష్ణోగ్రత వద్ద కరుగుతుంది. మానవ చేతి లేదా చాలా వెచ్చని గది లాంటి ఉష్ణోగ్రతలో . గట్టిగా ఉంటుంది. దీనికి చాలా ఎక్కువగా (4044°F) బాయిలింగ్ పాయింట్ కలిగి ఉంది.

ఏప్రిల్ 12, 2018 నుండి వచ్చిన ABC10 వార్తా నివేదిక, రాయిపై ఉంచిన మేకు గాలియంతో తయారు చేయబడిందని, ఇది 29 డిగ్రీల C (85.6 ° F) ద్రవీభవన స్థానం కలిగి ఉందని.. అలా గాలి తగలగానే సులభంగా కరిగిపోతుందని పేర్కొంది.


వైరల్ వీడియోలోని రాయిలో ఎటువంటి మాయ లేదని స్పష్టంగా తెలుస్తోంది, అయితే వీడియోలోని మేకులు 29 డిగ్రీల C (85.6 ° F) తక్కువ ద్రవీభవన స్థానం కలిగిన గాలియంతో తయారు చేయబడినందున కరిగిపోవడానికి కారణమైంది.

కాబట్టి రాయిలో ఎటువంటి మ్యాజిక్ లేదని నిర్ధారణ అయింది.


Claim Review:మ్యాజిక్ నిండిన రాళ్లు.. మేకులను కరిగిపోయేలా చేయగలవా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Twitter Users
Claim Fact Check:False
Next Story