లాటరీ పోటీలో డబ్బును గెలుచుకునే అవకాశాన్ని కల్పించడానికి 'కోకాకోలా' సంస్థ తన సంక్షేమ నిధిని ఉపయోగిస్తోందని పలువురు ఫేస్‌బుక్ వినియోగదారులు ఒక లింక్‌ను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు.
నిజ నిర్ధారణ:
ఈ లింక్ నకిలీ అని స్పష్టంగా తెలుస్తోంది.
వైరల్ లింక్‌పై క్లిక్ చేసిన తరువాత 'మోసపూరిత సైట్' అనే హెచ్చరికను కలిగి ఉన్న పేజీకి మళ్ళించబడతారు. వెబ్‌సైట్ ఫేక్ అని.. ఇందులో ఎంటర్ అయితే మన డేటాకు భంగం వాటిల్లే అవకాశం ఉండచ్చని స్పష్టంగా అర్థం అవుతుంది. అధికారిక వెబ్ సైట్లకు ఇలాంటివి కనిపించవు. కోకాకోలా యొక్క వెబ్‌సైట్‌కు నిజమైన లింక్ https://www.coca-colacompany.com/ ఇదే..!
వైరల్ లింక్‌కు సంబంధించి, కంబోడియా అంతర్గత వ్యవహారాల సైబర్ క్రైమ్ విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది. 'కోకాకోలా నుండి బహుమతులు గెలుచుకోవచ్చంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లింక్ ల వెనుక ఓ పెద్ద కుంభకోణం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సైబర్ క్రైమ్ వ్యతిరేక విభాగం డైరెక్టర్ చీ పోవ్ మాట్లాడుతూ సోషల్ మీడియా యూజర్లు ఈ రకమైన సందేశాన్ని పట్టించుకోవద్దని కోరారు. ఇలాంటి లింక్ లపై క్లిక్ చేయడం వలన డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉందని.. వ్యక్తిగత డేటా కూడా లీక్ అయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.
కోకాకోలా ఫిలిప్పీన్స్ కెరీర్స్ దీనిపై ఒక ప్రకటన విడుదల చేసింది. కోకా-కోలా బేవరేజెస్ ఫిలిప్పీన్స్ కోకా-కోలా వెల్ఫేర్ ఫండ్ క్రింద ఎటువంటి లింక్‌ను పంపిణీ చేయలేదు. దీనికి నగదు ప్రోత్సాహకాలను ఇస్తామని.. వైరల్ అవుతున్న సర్వేను నమ్మకండని తెలిపారు. ఇలాంటి స్కామ్ లపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
కోకాకోలా సంక్షేమ నిధి అంటూ లాటరీలో డబ్బు గెలవడానికి అవకాశం ఇస్తున్నామని వైరల్ అవుతున్న లింక్ 'ఫేక్' అని స్పష్టంగా తెలుస్తోంది.