FactCheck : జొమాటో ప్రమోషన్ కోసం అందమైన అమ్మాయిలకి ఉద్యోగాలు ఇచ్చారా?

ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో టీ-షర్ట్ ధరించి, ఆ కంపెనీ రెడ్ కలర్ ఫుడ్ డెలివరీ బ్యాగ్‌తో మోటార్‌సైకిల్ నడుపుతున్న

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Oct 2023 3:30 PM GMT
FactCheck : జొమాటో ప్రమోషన్ కోసం అందమైన అమ్మాయిలకి ఉద్యోగాలు ఇచ్చారా?

ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో టీ-షర్ట్ ధరించి, ఆ కంపెనీ రెడ్ కలర్ ఫుడ్ డెలివరీ బ్యాగ్‌తో మోటార్‌సైకిల్ నడుపుతున్న ఒక యువతికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. జొమాటో కంపెనీ అందమైన అమ్మాయిలను ఫుడ్ డెలివరీ కోసం నియమించిందంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు.

రాజీవ్ మెహతా అనే ట్విట్టర్ వినియోగదారు.. ఇండోర్‌లోని జోమాటో మార్కెటింగ్ హెడ్ నియమించిన మహిళ అని పేర్కొంటూ వీడియోను షేర్ చేశారు. “Indore #Zomato marketing head had this idea. He hired a model to drive around with an empty Zomato bag for one hour in the morning and one hour in the evening. @zomato is on a roll… (sic)” అంటూ పోస్టు పెట్టారు. ఆమె ఉదయం ఒక గంట.. సాయంత్రం ఒక గంట ఖాళీ బ్యాగుతో రౌండ్స్ వేస్తుందని పోస్టుల్లో తెలిపారు.

నిజ నిర్ధారణ :

న్యూస్‌మీటర్ బృందం వైరల్ క్లెయిమ్ లో ఎటువంటి నిజం లేదని కనుగొంది.

జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్‌లో తన కంపెనీకి ఈ మహిళతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇండోర్‌లో ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌కు మార్కెటింగ్ హెడ్ కూడా లేరని తెలిపారు.

రాజీవ్ పోస్ట్‌కి గోయల్ సమాధానం ఇచ్చారు. “హే! దీనితో మాకు ఎలాంటి సంబంధం లేదు. మేము హెల్మెట్ లేకుండా బైకి డ్రైవింగ్ ను కూడా ఆమోదించము. అలాగే, మాకు ఇండోర్ లో మార్కెటింగ్ హెడ్ లేరు" అని తెలిపారు. మహిళలు ఆహారాన్ని డెలివరీ చేయడంలో తప్పు లేదన్నారు. తమ కుటుంబాలకు జీవనోపాధి కోసం ప్రతిరోజూ ఆహారాన్ని డెలివరీ చేసే వందలాది మంది మహిళలు ఉన్నారని.. వారి పని తీరు గురించి తాము గర్విస్తున్నామని ఆయన అన్నారు.

క్లారిటీ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అంటూ పలువురు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

కాబట్టి, మార్కెటింగ్ కోసం ఇండోర్‌లో Zomato సంస్థ మోడల్‌ను నియమించుకుందని వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని మేము నిర్ధారించాము.

Credits : Md Mahfooz Alam

Claim Review:జొమాటో ప్రమోషన్ కోసం అందమైన అమ్మాయికి ఉద్యోగాలు ఇచ్చారా?
Claimed By:X Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:X
Claim Fact Check:False
Next Story