పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలోని 125 ఆర్‌ఎస్‌ఎస్ పాఠశాలలను మూసివేస్తున్నారని రిపబ్లిక్ టీవీ ప్రసారం చేసిన స్క్రీన్‌గ్రాబ్ ఆన్‌లైన్‌లో షేర్ చేయబడుతోంది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతూ ఉంది.
సంజయ్ దీక్షిత్ ఈ స్క్రీన్ షాట్ ను పోస్ట్ చేశారు. "I love Didi. What a slap in return for a congratulatory message. 125 RSS schools were banned. Cowards deserve every bit of this (sic)." అంటూ ట్వీట్ చేశారు.
విశ్వవాణి దినపత్రిక ఎడిటర్-ఇన్-చీఫ్ విశ్వేశ్వర్ భట్ కూడా రిపబ్లిక్ టీవీ ప్రసారానికి సంబంధించిన స్క్రీన్‌గ్రాబ్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
నిజ నిర్ధారణ :
కీవర్డ్ సెర్చ్ ప్రకారం... 2018లో జరిగిన ఒక సంఘటనను అప్పట్లో రిపబ్లిక్ టీవీ ప్రసారం చేసిన వీడియోకు దారితీసింది. ఆ వీడియో ప్రకారం "పశ్చిమ బెంగాల్‌లోని RSS పాఠశాలలను మమతా బెనర్జీ నిషేధించింది". "Mamata Banerjee Bans RSS Schools In West Bengal". అనే టైటిల్ తో వీడియోను పోస్ట్ చేశారు.
హిందుస్థాన్ టైమ్స్, ఫస్ట్ పోస్ట్ ప్రకారం.. 2018లో, పశ్చిమ బెంగాల్ విద్యా మంత్రి పార్థ ఛటర్జీ మాట్లాడుతూ, నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ లేకుండా పనిచేస్తున్న RSSకి అనుబంధంగా ఉన్న 125 పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి నిలిపివేసిందని చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్ స్ఫూర్తితో 493 పాఠశాలలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందిందని, అందులో 125 పాఠశాలలు ప్రభుత్వం నుంచి ఎలాంటి అభ్యంతర పత్రం లేకుండానే నడుస్తున్నాయని మంత్రి తెలిపారు. ఆ పాఠశాలలు పనిచేయకుండా ఆపాలని నిర్ణయించామని తెలిపారు.
ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలు విద్యార్థులకు చదువు చెప్పించే ముసుగులో ఇతర విషయాలను శిక్షణ ఇస్తున్నట్లు తేలితే ప్రభుత్వం "తగు చర్యలు" తీసుకుంటుందని ఛటర్జీ అన్నారు. అనేక ఇతర మీడియా సంస్థలు కూడా ఇదే విషయాన్ని నివేదించాయి.
పశ్చిమ బెంగాల్‌లో 125 RSS పాఠశాలల మూసివేత 2018లో జరిగింది. ఇటీవలిది కాదు. ఈ ట్వీట్లు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయి.
కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.