Fact Check : విరాట్ కోహ్లీ నబీని బౌలింగ్ తీసుకోమని చెప్పాడా..?

Did Virat Kohli Ask Afghanistans Captain to Choose Bowling. భారత్-ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ సమయంలోని టాస్ వీడియో సోషల్ మీడియాలో

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 Nov 2021 5:39 AM GMT
Fact Check : విరాట్ కోహ్లీ నబీని బౌలింగ్ తీసుకోమని చెప్పాడా..?

భారత్-ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ సమయంలోని టాస్ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. టాస్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ మహ్మద్ నబీని బౌలింగ్ ఎంచుకోమని కోరినట్లు కొందరు చెబుతున్నారు.

ఫీల్డింగ్ ఎంచుకోవాలని ఆఫ్ఘనిస్తాన్‌కు సూచించింది కోహ్లి అని సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొంటున్నారు.

"వీడియో చూడండి.. కోహ్లీ నబీకి చెబుతున్నది జాగ్రత్తగా వినండి.. మీరు మొదట బౌలింగ్ చేయబోతున్నారు" అని వైరల్ పోస్ట్ వైరల్ అవుతోంది.

వైరల్ పోస్ట్‌లను వీక్షించడానికి ఇక్కడ క్లిక్ చేయండి

నిజ నిర్ధారణ :

వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.

NewsMeter మొదటగా కీవర్డ్ సెర్చ్‌ని నిర్వహించింది.. ఇది టాస్ వివాదానికి సంబంధించి నవంబర్ 05, 2021న టైమ్స్ నౌ న్యూస్ అందించిన నివేదికకు దారితీసింది. పాకిస్థాన్, న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌ల్లో ఓడిన భారత్‌ ఆఫ్ఘనిస్తాన్ పై 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. వైరల్ వీడియోలో స్క్రీన్‌ రికార్డింగ్ ను ఉపయోగించినట్లు బృందం గమనించింది.

2021 T20 ప్రపంచ కప్‌లో భారత్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ 'ఫిక్స్' అయిందని ఆరోపిస్తున్న ట్వీట్లు ఇంటర్నెట్‌లో ఉన్నాయి. ఇండియా 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించడంతో ఇంటర్నెట్‌లో ఈ పోస్టులు వెల్లువెత్తాయి. సెమీ-ఫైనల్ కు భారత్ ఆశలు సజీవంగా నిలవడంతో ఈ మ్యాచ్ ఫిక్స్ అయినట్లు కొందరు కావాలనే ఆరోపించారు. టాస్ సమయంలో ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ మహ్మద్ నబీ తన ప్రత్యర్థి విరాట్ కోహ్లీకి తాను మొదట బౌలింగ్ చేయబోతున్నానని చెప్పడం వినవచ్చు. తర్వాత మైక్ లో అదే విషయాన్ని నబీ చెప్పుకొచ్చారు. అయితే కొందరు వ్యక్తులు ఈ ఘటనపై నబీ తన నిర్ణయాన్ని కోహ్లీకి ముందే ఎందుకు చెప్పారని ప్రశ్నించడం మొదలుపెట్టారని అంటున్నారు.

అయితే క్రికెట్ విశ్లేషకులు మాత్రం టాస్ వేసిన తర్వాత మొదట కెప్టెన్లు మాట్లాడుకుంటారని.. ఆ తర్వాత మైక్ లో చెబుతారని తెలిపారు. ఇదే ఘటనే ఆఫ్ఘనిస్తాన్-భారత్ మ్యాచ్ లో చోటు చేసుకుందని తెలిపారు. "ఇద్దరు కెప్టెన్ల మధ్య టాస్ జరిగినప్పుడు, ఒక కెప్టెన్ అతను ఏమి చేయాలనుకుంటున్నాడో మరొకరికి చెబుతాడు" అని క్రికెట్ నిపుణులు తెలిపారు. కాబట్టి నబీ కోహ్లీకి 'మేము ముందుగా బౌలింగ్ చేస్తాం' అని చెప్పాడు. తరువాత అదే విషయాన్ని అధికారికంగా చెప్పాలి, కాబట్టి అతను దానిని పునరావృతం చేశాడు. అంతే తప్ప ఇందులో ఎటువంటి ఫిక్సింగ్ కోణం లేదని తెలుస్తోంది.

https://www.timesnownews.com/sports/cricket/article/toss-controversy-video-from-india-afghanistan-match-goes-viral-david-gower-rashid-latif-clarify/829348

నవంబర్ 4, 2021న 'జియో న్యూస్' వెబ్‌సైట్‌లో వివాదాస్పద టాస్‌పై ఇలాంటి నివేదికను బృందం కనుగొంది.

WION నివేదిక ప్రకారం, ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌లో భారతదేశం అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన తర్వాత కూడా, కొంతమంది వినియోగదారులు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) మ్యాచ్‌ను ఫిక్సింగ్ చేశారని ఆరోపించారు. టీ20 వరల్డ్ కప్ లో భారత్-ఆఫ్గనిస్తాన్ టాస్ వివాదం బయటకు వచ్చింది.

డిస్నీ + హాట్‌స్టార్‌లో ఈ మ్యాచ్‌కి సంబంధించిన పూర్తి వీడియోను ఫ్యాక్ట్ చెక్ టీమ్ కూడా కనుగొంది. 2:07 నిమిషాలకు, మహమ్మద్ నబీ 'హెడ్స్' అని చెప్పిన వైరల్ క్లిప్‌ను బృందం కనుగొంది. అంపైర్ ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచినట్లు ప్రకటించాడు మరియు నబీ ముందుగా బౌలింగ్ చేస్తామని కోహ్లీకి తెలియజేశాడు. క్లిప్‌లో ఎక్కడా కోహ్లీ ఇంకేమీ చెప్పలేదు. కాబట్టి వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.

https://www.hotstar.com/in/sports/sports/replay-india-vs-afghanistan/1540009368

కాబట్టి వైరల్ పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. టాస్ సమయంలో కోహ్లీ ఎటువంటి సూచనలు కూడా ఆఫ్ఘన్ కెప్టెన్ కు చెప్పలేదు.


Claim Review:విరాట్ కోహ్లీ నబీని బౌలింగ్ తీసుకోమని చెప్పాడా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Facebook Users
Claim Fact Check:False
Next Story