అత్యాచారం చేయడానికి ప్రయత్నించిన యువకుల చేతులను, కాళ్లను దళిత అమ్మాయిలు నరికేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుందనే పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. హిందీలో ఉన్న టెక్స్ట్ ను పలువురు షేర్ చేస్తూ ఉన్నారు.
उoप्रo जनपद एटा कोतवाली देहात थाना क्षेत्र का मामला जहा ग्राम के 2 दबंगो ने 2 नाबालिग दलित बच्चियो से किया बलात्कार करने का प्रयास, आरोपियो के हाथ पर काट कर नाबालिक बच्चियां पहुँची अपने घर। అంటూ పోస్టులు పెడుతూ వస్తున్నారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న పోస్టు నిజం కాదు.
న్యూస్‌మీటర్ కీవర్డ్ సెర్చ్ చేసింది కానీ ఉత్తర ప్రదేశ్‌లోని ఎటాలో అలాంటి సంఘటనకు సంబంధించి ఎలాంటి రిపోర్ట్ దొరకలేదు. 12 సెప్టెంబర్ 2021 నుండి ఎటా పోలీసులు చేసిన ట్వీట్ మాకు దొరికింది. వైరల్ పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టించేవని.. వాటిని నమ్మకండని తెలిపారు. ఇటీవలి కాలంలో అలాంటి ఘటన చోటు చేసుకోలేదని తెలిపారు.
ఉత్తర ప్రదేశ్ పోలీస్ ఫ్యాక్ట్ చెక్ టీం యొక్క అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా మేము ఒక ట్వీట్‌ను కనుగొన్నాము. వారు వైరల్ క్లెయిమ్‌ను ఖండించారు. అవి నకిలీ వార్తలు అని చెప్పారు."ఎటాహ్ పోలీసుల ప్రకారం, కొత్వాలి ప్రాంతంలో ఇద్దరు బాలికలపై అత్యాచారానికి ప్రయత్నించిన సంఘటన, విచారణ తర్వాత, అవాస్తవమని తేలింది. దయచేసి పోస్ట్ చేయడం ద్వారా పుకార్లు వ్యాప్తి చేయవద్దు. ధృవీకరణ లేకుండా తప్పుదోవ పట్టించే సమాచారం పోస్టు చేయకండని" పోలీసులు కోరారు.
అందువల్ల వైరల్ పోస్ట్ తప్పు అని స్పష్టమవుతోంది. ఉత్తర ప్రదేశ్ లోని ఎటాలో అలాంటి సంఘటన చోటు చేసుకోలేదు. ప్రజలను తప్పుదోవ పట్టించాలని వీటిని షేర్ చేశారు. అత్యాచారం చేయడానికి ప్రయత్నించిన యువకుల చేతులను దళిత అమ్మాయిలు నరికేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకోలేదు.