తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై బిర్యానీని నిషేధించాలని కోరినట్లు సోషల్ మీడియా వినియోగదారులు వైరల్ న్యూస్ కార్డ్‌ను షేర్ చేస్తున్నారు. బిర్యానీ తినే వారు నిజమైన హిందువులు కాదని అన్నామలై అన్నట్లు మరో న్యూస్ కార్డ్ కూడా వైరల్ అవుతూ ఉంది.
పలు సోషల్ మీడియా సైట్లలో వైరల్ న్యూస్ కార్డును షేర్ చేస్తూ ఉన్నారు.
నిజ నిర్ధారణ :
వైరల్ పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
NewsMeter వైరల్ పోస్టులకు మద్దతు ఇచ్చే నివేదికల కోసం శోధించింది.. కానీ ఏదీ కనుగొనబడలేదు. అయితే వైరల్ న్యూస్ కార్డ్‌ను షేర్ చేసి, అది ఫేక్ అని తమిళనాడు బీజేపీ ఐటీ, సోషల్ మీడియా విభాగానికి చెందిన నిర్మల్ కుమార్ చేసిన ట్వీట్‌ను మేము కనుగొన్నాము.
రెండవ న్యూస్ కార్డ్‌లో తమిళనాడుకు చెందిన మీడియా సంస్థ న్యూస్ 7 తమిళ్ లోగో ఉంది. న్యూస్ 7 తమిళ్ ఒక ట్వీట్‌లో వైరల్ న్యూస్ కార్డ్ ఫేక్ అని క్లారిటీ ఇచ్చింది.
పలువురు బీజేపీ నేతలు కూడా ఈ వైరల్ పోస్టులో ఉన్న కథనం అబద్ధమని తెలిపారు.
వైరల్ పోస్ట్ ద్వారా చేసిన వాదన తప్పు అని స్పష్టమైంది. తమిళనాడు బీజేపీ నేత అన్నామలై బిర్యానీపై నిషేధం విధించాలని కోరారని, బిర్యానీ తినే వారు నిజమైన హిందువులు కాదని చెప్పారంటూ వైరల్ అవుతున్న న్యూస్ కార్డులలో ఎటువంటి నిజం లేదు.