కశ్మీర్ విషయంలో తాలిబాన్లు భారతదేశాన్ని బెదిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
"పాకిస్తాన్ తో యుద్ధం చేస్తామని భారతదేశం బెదిరిస్తోందని నేను విన్నాను. మేము పాకిస్తాన్ సైన్యం మరియు దేశంతో ఉన్నామని భారతదేశ హిందూ ప్రభుత్వానికి చెప్పాలనుకుంటున్నాము. మీరు మాకు ఏమీ చేయలేరు. మేము అమెరికాను ఏడిపించినట్లు, మేము మీకూ అదే చేస్తాం"ఉర్దూ ప్రసంగం ఉంది.
ఆఫ్ఘనిస్తాన్‌లో అష్రఫ్ ఘనీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూలదోయడం ద్వారా తాలిబాన్లు దేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత ఈ వీడియో వెలుగులోకి వచ్చింది. ఒక సోషల్ మీడియా యూజర్ వీడియోను షేర్ చేసి, "ఇక్కడ తాలిబాన్ నుండి కూడా ముప్పు పొంచి ఉంది" అని క్యాప్షన్ ఉంచారు.
వైరల్ పోస్టులను ఇక్కడ చూడొచ్చు:
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న వీడియో ప్రజలను తప్పుద్రోవ పట్టించే విధంగా ఉంది.
న్యూస్ మీటర్ వివిధ కీఫ్రేమ్‌ల ను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసింది. ఈ వీడియో రెండేళ్ల పాతది. 2019 నుండి సోషల్ మీడియాలో ఉంది.
ఫిబ్రవరి 2019 లో ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన వీడియోను మేము కనుగొన్నాము. 'అల్లా హు అక్బర్' అనే ఫేస్‌బుక్ పేజీ 'ఆఫ్ఘన్ తాలిబాన్ ఇండియా కు హెచ్చరిక' పేరుతో ఈ వీడియోను షేర్ చేసింది. ఇది ఉర్దూలో ఉంది. 'భారత్ కు తాలిబాన్ల ఓపెనింగ్ వార్నింగ్.. పాకిస్తాన్‌పై దాడి చేయడానికి ప్రయత్నిస్తే భారత్ ను అమెరికా, రష్యా లాగా మారుస్తాము' అని ఉంది.
'City Mobile Communication' అనే ఫేస్ బుక్ పేజీలో కూడా ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోను షేర్ చేయాలని.. తాలిబాన్లు పాకిస్తాన్ ఆర్మీకి మద్దతు ఇచ్చారు అంటూ పోస్టు చేశారు.
March 22, 2019, న 'Afghan Taliban Hard Reply To India' అంటూ యూట్యూబ్ లో వీడియోను పోస్టు చేశారు.
అయితే ఇటీవల తాలిబాన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. కాశ్మీర్ అంశం భారత్ అంతర్గత వ్యవహారమని.. అందులో తాము జోక్యం చేసుకోబోమని తెలిపారు.
కాబట్టి ప్రస్తుతం తాలిబాన్లు భారత్ గురించి ఆలోచిస్తున్న తీరుకు.. గతంలో చేసిన వ్యాఖ్యలకు ఎటువంటి పొంతన లేదు. కాబట్టి వైరల్ వీడియో ప్రజలను తప్పుద్రోవ పట్టిస్తోంది.