భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ గ్రౌండ్ స్టాఫ్‌తో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. వైరల్ అవుతున్న చిత్రం రోహిత్ శర్మ తనకు వచ్చిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ను గ్రౌండ్ స్టాఫ్ కి ఇచ్చేశారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
గ్రౌండ్ స్టాఫ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చెక్‌ను పట్టుకుని ఉండగా, భారత కెప్టెన్ రోహిత్ శర్మ వారి ముందు నిలబడి ఉన్నాడు.
చాలా మంది ట్విట్టర్ వినియోగదారులు ఈ చిత్రాన్ని “రోహిత్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గ్రౌండ్ సిబ్బందికి అందజేశారు.” అంటూ పోస్టులు పెట్టారు.
ఆసియా కప్‌లో సూపర్‌ఫోర్ దశలో భారత్ 228 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించిన తర్వాత ఈ పోస్టు వైరల్ అవుతూ వచ్చింది. పాకిస్థాన్ మ్యాచ్ సమయంలో తరచూ వర్షం కురుస్తుండటంతో ఆట నిలిచిపోయి రిజర్వ్ డే వరకు పొడిగించారు. ఈ మ్యాచ్ లో టీమిండియా అద్భుతంగా ఆడింది.
నిజ నిర్ధారణ :
పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 122 పరుగులతో అజేయంగా నిలిచిన భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ప్రకటించారు. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వలేదని న్యూస్‌మీటర్ కనుగొంది.
రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో.. సెప్టెంబర్ 12, 2023 న ఒక పోస్టును పెట్టారు. ‘Ind Vs Pak: Not Kohli, Rahul, Kuldeep, these are the real heroes, thanks to the captain.’ అనే శీర్షికతో సెప్టెంబర్ 12, 2023న లోక్‌మంత్ర అందించిన నివేదికలో అసలు చిత్రం మాకు కనిపించింది.
అయితే, ఈ చిత్రంలో గ్రౌండ్స్‌మెన్‌ల చేతిలో ఎలాంటి చెక్కు కనిపించలేదు.
మేము కీవర్డ్ సెర్చ్ ను కూడా నిర్వహించాము. కానీ భారత కెప్టెన్ రోహిత్ శర్మ గ్రౌండ్స్‌మెన్‌కు చెక్కును అందించినట్లు ఎటువంటి నివేదిక కనుగొనబడలేదు. భారత కెప్టెన్ అలాంటి పని చేసి ఉంటే, అది మీడియా దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది.
ఇండియా టుడే నివేదికను కూడా మేము చూశాము. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి గ్రౌండ్ స్టాఫ్ లను ప్రశంసించారు, రెండు రోజుల పాటు సాగిన మ్యాచ్ లో అనేక అంతరాయాలు చోటు చేసుకున్నాయి. సెప్టెంబర్ 11న పాకిస్తాన్‌ను భారత్ ఓడించింది.
కాబట్టి, భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చెక్‌ను గ్రౌండ్ స్టాఫ్‌కు ఇచ్చారనే వాదన తప్పు అని మేము నిర్ధారించాము. వైరల్ చిత్రం మార్ఫింగ్ చేశారు.
Credits : Md Mahfooz Alam