బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ ఓ అభిమాని ఫోన్ విసిరేసిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన ఓ అభిమానికి చెందిన ఫోన్‌ని విసిరేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ట్విట్టర్ యూజర్లు “Whoa! A visibly angry #RanbirKapoor throws the phone of a fan who wanted to click a selfie…” (Archive) అని చెబుతూ ఉన్నారు.
టైమ్స్ నౌ, న్యూస్ 9, న్యూస్ 18, ది ఎకనామిక్ టైమ్స్, బాలీవుడ్ లైఫ్, ఒపిండియా వంటి మీడియా సంస్థలు ఇది యదార్థ సంఘటన అని పేర్కొంటూ వీడియోను వైరల్ అవుతోంది.
నిజ నిర్ధారణ :
ఇది మొబైల్ కంపెనీ యాడ్ అనేది తెలుస్తోంది.
Oppo ఇండియా ప్రారంభించిన కొత్త మొబైల్ కు సంబంధించిన ప్రకటనలో భాగంగా వైరల్ వీడియో భాగమని NewsMeter బృందం కనుగొంది.
Oppo Indiaకు సంబంధించి ధృవీకరించబడిన Twitter హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఒరిజినల్ వీడియోను మేము కనుగొన్నాం. ఈ ఘటనకు సంబంధించిన మరో వీడియోను మేము కనుగొన్నాము. రణబీర్ కపూర్ తన పాత ఫోన్‌ని విసిరివేసి ఓ అభిమానికి కొత్త ఫోన్‌ను బహుమతిగా ఇస్తున్నట్లు ఇందులో చూపించారు. ట్వీట్ ప్రకారం, రణబీర్ కపూర్ ఒక అభిమానికి కొత్త Oppo Reno 8Tని బహుమతిగా ఇచ్చాడు, ఇది ఫిబ్రవరి 3 న విడుదల అవుతుంది.
వీడియోలో కొత్త ఫోన్‌ని అందుకుంటున్న యువకుడు నైనేష్ కరంచందానీ. ఒక నటుడు అని మేము కనుగొన్నాము. అతను వీడియో పొడవైన వెర్షన్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. రణబీర్ కపూర్ ఒక మంచి వ్యక్తి అని.. అతను తన ఫోన్‌ను విసిరేయలేదని చెప్పాడు.
రణబీర్ కపూర్ అభిమాని ఫోన్‌ని విసిరేయలేదు. వైరల్ వీడియో నిజమైన సంఘటన కాదని, Oppo ఇండియా తన కొత్త ఫోన్ Oppo Reno 8T లాంచ్ కోసం చేసిన యాడ్ లో భాగమని స్పష్టంగా తెలుస్తుంది. అందువల్ల, సోషల్ మీడియా వినియోగదారులు, మీడియా సంస్థల దావా ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని మేము నిర్ధారించాము.