భారత రాష్ట్రపతి చేసిన ట్వీట్ యొక్క స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నటి కంగనా రనౌత్ పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆ ట్వీట్‌లో ప్రధాని నరేంద్ర మోదీని కోరారు.
1947లో బ్రిటిష్ వారి నుండి భారతదేశం స్వాతంత్ర్యం పొందడం "భిక్ష" అని రనౌత్ ఇటీవల టైమ్స్ నౌ షోలో చెప్పిన తర్వాత ఇది జరిగింది.
ఆ ట్వీట్‌ను అనువదించినప్పుడు.. "కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు దేశప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసేలా ఉంది. ఆమెకు పద్మ అవార్డు ఇచ్చినందుకు నేను సిగ్గుపడుతున్నాను! అవార్డును ఉపసంహరించుకోవడానికి నన్ను అనుమతించాలని శ్రీ @narendramodiని అభ్యర్థిస్తున్నాను." అని ఉంది.
నిజమెంత :
వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్ లో ఎటువంటి నిజం లేదు.
స్క్రీన్ షాట్ లో ఉన్న @rashtrptibhvn ట్విట్టర్ పేజీని ఓపెన్ చేయగా.. ఆ అకౌంట్ ను సస్పెండ్ చేశారని తెలుస్తోంది.
President ను కూడా తప్పుగా 'Prasident' అని ట్విట్టర్ ఖాతాలో ఉండడం చూడొచ్చు.. అసలు వెరిఫికేషన్ మార్క్ అన్నది లేదు. వెరిఫై అయినట్లు కూడా కనిపించలేదు.
భారత ప్రెసిడెంట్ ట్విట్టర్ ఖాతా @rashtrapatibhvn లొకేషన్ లో New Delhi అని ఉంది. ట్విట్టర్ లో జాయిన్ అయిన డేట్ July 2017 అని తెలుసుకోవచ్చు. వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్ లోని ట్విట్టర్ ఖాతా @rashtrptibhvn లొకేషన్ United States of America అని ఉంది.. జాయిన్ అయిన డేట్ November 2020 అని ఉంది. కాబట్టి ఇటీవల కొందరు కావాలనే ఈ ఫేక్ ట్విట్టర్ ఖాతాను ఓపెన్ చేసినట్లు తెలుస్తోంది.
ఇక రామ్ నాథ్ కోవింద్ అధికారిక ఖాతాను ఓపెన్ చేసి చూడగా.. కంగనా పద్మశ్రీని వెనక్కు తీసుకోవాలని ఎక్కడ కూడా చెప్పలేదు. కాబట్టి వైరల్ స్క్రీన్ షాట్ లో ఎటువంటి నిజం లేదు.