FactCheck : ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ కింగ్ పాదాలకు నమస్కరించారా..?

Did Modi touch the Saudi Kings feet no the photo is edited. సౌదీ అరేబియా రాజు సల్మాన్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ అల్‌ సౌద్‌కు ప్రధాని నరేంద్ర మోదీ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Jun 2022 5:30 PM IST
FactCheck : ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ కింగ్ పాదాలకు నమస్కరించారా..?

సౌదీ అరేబియా రాజు సల్మాన్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ అల్‌ సౌద్‌కు ప్రధాని నరేంద్ర మోదీ సాష్టాంగ నమస్కారం చేస్తున్న ఫొటో ఒకటి వాట్సాప్‌లో షేర్‌ అవుతోంది. మహ్మద్ ప్రవక్తపై బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను గల్ఫ్ దేశాలు ఖండించిన నేపథ్యంలో ఇది జరిగింది.


నిజ నిర్ధారణ :

NewsMeter రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి 2013లో NDTV మరియు ది ఎకనామిక్ టైమ్స్ ప్రచురించిన నివేదికలలో అసలు ఇమేజ్‌ని కనుగొంది. భోపాల్‌లో జరిగిన బహిరంగ ర్యాలీలో బీజేపీ దిగ్గజ నాయకులు లాల్ కృష్ణ అద్వానీ పాదాలకు నరేంద్ర మోదీ నమస్కరిస్తున్నట్లు ఫోటో చూపిస్తుంది.


మోదీని అద్వానీ గుర్తించక పోవడంతో ఆ ఫోటో అప్పట్లో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది. మోదీని బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా చేసిన తర్వాత ఇద్దరు నాయకులు మొదటిసారి బహిరంగంగా వేదికను పంచుకున్నారు. ఈ మొత్తం ఘటనను పలు మీడియా సంస్థలు ప్రసారం చేశాయి. అందుకు సంబంధించిన లింక్స్ ను మీరు పరిశీలించవచ్చు.




కాబట్టి, వైరల్ అవుతున్న ఫోటోల్లో ఎటువంటి నిజం లేదు.




















Claim Review:ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ కింగ్ పాదాలకు నమస్కరించారా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media Users
Claim Fact Check:False
Next Story