'ఈ దేశానికి చంద్రబాబు నాయుడు నాయకత్వం కావాలి' అని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నట్లు సోషల్ మీడియాలో ఓ న్యూస్ కార్డ్ విపరీతంగా షేర్ అవుతోంది.
'ఈ దేశానికి చంద్రబాబు నాయుడు నాయకత్వం కావాలి. సమాఖ్య స్ఫూర్తి, సామాజిక న్యాయం వంటి రాజ్యాంగ హక్కులపై దాడి జరుగుతోంది. వాటిని కాపాడుకొనేందుకు జాతీయ స్థాయిలో ఒక వేదిక అవసరం-స్టాలిన్' అని ఉన్న ఓ ఫోటో వైరల్ అవుతూ ఉంది.
సోషల్ మీడియాలో ఈ ఫోటోను తెగ షేర్ చేస్తూ ఉన్నారు.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.
న్యూస్ మీటర్ బృందం ఈ ఫోటోలోని వ్యాఖ్యలపై కీవర్డ్ సెర్చ్ చేసింది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి వార్తా కథనాలను ఇటీవలి కాలంలో మేము చూడలేదు. ముఖ్యంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అటువంటి వ్యాఖ్యలేవీ కనిపించలేదు. స్టాలిన్ అటువంటి వ్యాఖ్యలు చేయలేదు. మేము ఇందుకు సంబంధించిన ఎటువంటి ఆర్టికల్ ను కూడా చూడలేదు.
చంద్రబాబు నాయుడు, స్టాలిన్ భేటీకి సంబంధించి మార్చి 2018న ఉంచిన కొన్ని రిపోర్టులను గమనించాము. ETV Andhra Pradesh యూట్యూబ్ ఛానల్ లో అందుకు సంబంధించిన వీడియో ఉంది. "MK Stalin Praises Chandrababu over Fight Against Centre for State Rights." అంటూ వీడియోను అప్లోడ్ చేశారు.
దీనిని ఒక క్లూగా తీసుకొని, మేము మరొక కీవర్డ్ సెర్చ్ చేసాము. ఇది మార్చి 17, 2018న టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదికకు దారితీసింది. "'Welcome growing support for the Dravidian land concept" అంటూ ఆర్టికల్ ను పోస్ట్ చేశారు.
అప్పట్లో బీజేపీ కూటమి నుండి బయటకు వచ్చినందుకు ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును స్టాలిన్ ప్రశంసించారు. రాష్ట్ర హక్కుల కోసం చంద్రబాబు నాయుడు పోరాడుతున్న తీరు చూస్తున్నా ఈపీఎస్, ఓపీఎస్‌లకు రాష్ట్రంపై కనీసం మమకారం లేకపోవడం బాధాకరం అని స్టాలిన్ పేర్కొన్నారు. "Stalin earlier praised Andhra chief minister Chandrababu Naidu for walking out of the BJP alliance while hitting out at chief minister Edappadi K Palaniswami and his deputy OPS for not displaying similar commitment for the welfare of Tamil Nadu by putting pressure on the Centre. 'It is saddening that EPS and OPS do not have a similar concern for the state even after watching the manner in which Chandrababu Naidu is fighting for the rights of his state,' Stalin said," అంటూ ఆ కథనంలో ఉంది. అప్పుడు తమిళనాడు ప్రభుత్వం బీజేపీకి మద్దతు ఇవ్వడంపై స్టాలిన్ ఈ విమర్శలు చేశారు.
కాబట్టి వైరల్ అవుతున్న పోస్టు తప్పు అని స్పష్టమైంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చంద్రబాబు నాయుడు గురించి అటువంటి ప్రకటన చేయలేదు.