UK మాజీ ప్రధాని లిజ్ ట్రస్ కు ఆపాదించిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "నిరక్షరాస్యులైన నాయకులను, ఆధ్యాత్మిక బోధకులను గుడ్డిగా అనుసరించే దేశం భారతదేశం" అని ఆమె అన్నట్లుగా వైరల్ పోస్టులు పెడుతూ ఉన్నారు.
ఒక ట్విట్టర్ వినియోగదారు లిజ్ ట్రస్ ఫోటో గ్రాఫిక్‌ను ఆమె చేసిన వ్యాఖ్యలు అంటూ పంచుకున్నారు.
నిజ నిర్ధారణ :
న్యూస్‌మీటర్ వైరల్ గ్రాఫిక్ ప్లేట్ ను డిజిటల్‌గా ఎడిట్ చేశారని కనుగొన్నాం. ఒరిజినల్ గ్రాఫిక్‌లో UK ప్రధానమంత్రి పదవికి ఆమె రాజీనామా గురించి ప్రకటన ఉంది.
వైరల్ గ్రాఫిక్‌లో “బోల్తా హిందుస్థాన్” లోగోను మేము గమనించాము. దీన్ని ఒక క్యూగా తీసుకొని, మేము ట్విట్టర్ హ్యాండిల్ కోసం శోధించాము, అది గ్రాఫిక్‌లో కూడా పేర్కొనబడింది. అసలు చిత్రం 20 అక్టోబర్ 2022న పోస్ట్ చేయబడిందని కనుగొన్నాము. అసలు పోస్ట్ లో “నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేక రాజీనామా చేశాను” అని ఉంది.
మేము భారతదేశానికి సంబంధించి ట్రస్ చేసిన ప్రకటన గురించి కీవర్డ్ సెర్చ్ చేసాము. 24 ఫిబ్రవరి 2023న ప్రచురించిన ABP నివేదికను చూశాము. అందులో భారత్ ను ప్రశంసిస్తూ ట్రస్ పలు వ్యాఖ్యలు చేశారు. “భారతదేశం ఒక అగ్రగామి అని నేను భావిస్తున్నాను. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం, జనాభా ఉన్న దేశం. ఆర్థికంగా ఎంతో ఎదుగుతున్న దేశం." అని అన్నారు.
అందువల్ల, లిజ్ ట్రస్‌కి ఆపాదించబడిన వైరల్ ప్రకటనలో ఎటువంటి నిజం లేదని మేము నిర్ధారించాము.
- Credits : Md Mahfooz Alam