ఐఐటీ మణిపూర్‌లో రెండో సంవత్సరం చదువుతున్న రీతూ రాజ్ చౌదరి గూగుల్‌ను 52 సెకన్లలో హ్యాక్ చేశాడంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ విస్తృతంగా షేర్ అవుతోంది.
3.66 కోట్ల రూపాయల ప్యాకేజీ ఉద్యోగాన్ని గూగుల్ అతడికి ఆఫర్ చేయడమే కాకుండా.. గూగుల్ అతని సామర్థ్యాలను మెచ్చుకున్నట్లు చెబుతున్నారు. పలువురు వ్యక్తులు అతన్ని అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
NewsMeter బృందం సంబంధిత కీవర్డ్స్ తో సెర్చ్ ను చేసింది. మేము అనేక వార్తా నివేదికలను కనుగొన్నాము. టైమ్స్ ఆఫ్ ఇండియా రీతూ రాజ్ చౌదరి IIIT మణిపూర్ ('IIT మణిపూర్' కాదు) రెండవ సంవత్సరం విద్యార్థి అని, ఇటీవల Googleలో బగ్‌ను కనుక్కొన్నాడని పేర్కొంది (పోస్ట్‌లో పేర్కొన్నట్లు 52 సెకన్ల పాటు Googleని హ్యాక్ చేయలేదు).
'జీ'కి అతడు ఇచ్చిన ఇంటర్వ్యూను కూడా చూడవచ్చు. తాను గూగుల్‌ను హ్యాక్ చేసినట్లు ఎక్కడా చెప్పలేదు, కేవలం బగ్‌ను గూగుల్‌కు తెలిపినట్లు పేర్కొన్నాడు. అతని పేరు Google 'బగ్ హంటర్స్' జాబితాలో చూడవచ్చు.
అతడికి సంబంధించి ఈ పోస్టు వైరల్ అయినప్పుడు, రీతూ రాజ్ తన లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో వైరల్ క్లెయిమ్ ఫేక్ అని చెప్పాడు. గూగుల్ నుండి తనకు ఎలాంటి ప్యాకేజీ లేదా జాబ్ ఆఫర్ రాలేదని చెప్పాడు. అతను ఏదీ హ్యాక్ చేయలేదు, అతడు కనుక్కున్నది కేవలం బగ్ మాత్రమే. అతను బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్నాడు.
కాబట్టి వైరల్ అవుతున్న పోస్టు తప్పు. రీతు రాజ్ కేవలం ఒక బగ్‌ని నివేదించాడు. Google అతనికి ఎలాంటి ఉద్యోగం లేదా ప్యాకేజీని అందించలేదు.