FactCheck : 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా చూసొచ్చాక హిందువులు.. ముస్లింలపై దాడులు చేశారా..?

Did Hindus Attack Muslims after watching the kashmir files. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 April 2022 1:48 PM IST
FactCheck : ది కశ్మీర్ ఫైల్స్ సినిమా చూసొచ్చాక హిందువులు.. ముస్లింలపై దాడులు చేశారా..?

రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా చూసిన తర్వాత హిందూ గుంపు ముస్లింలపై దాడి చేసిందని వీడియోల ద్వారా చెప్పుకుంటూ వచ్చారు.

షాపులో కూర్చున్న కొంతమంది వ్యక్తులపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడం సీసీటీవీలలో రికార్డు అయిన వీడియోలో ఉంది. ఆ తర్వాత మరో వ్యక్తి వచ్చి కర్రలతో దాడి చేయడం ప్రారంభించాడు. తమను తాము రక్షించుకోడానికి కొందరు దాడి చేసిన వారిపై కొన్ని వస్తువులను విసిరివేయడం కూడా కనిపిస్తుంది. వీడియో చివర్లో, కొంతమంది షాప్ నుండి బయటకు వస్తున్నారు.

'తమ భద్రత కోసం ముస్లింలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాల్సిన కొత్త భారతదేశం' అని సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొన్నారు. ఇలాంటి క్యాప్షన్‌లతో ఉన్న ఈ వీడియో ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో షేర్ అవుతోంది.

నిజ నిర్ధారణ :

వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.

నివేదిక ప్రకారం, "సూరత్‌లోని భాతే ప్రాంతంలోని దుకాణదారున్ని ఆ ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు డబ్బు చెల్లించమని అడిగారు. ఈ డిమాండ్ కు వ్యతిరేకంగా దుకాణదారుడిపై కత్తితో దాడి చేసిన మొత్తం సంఘటన సీసీటీవీల్లో రికార్డ్ అయింది."

NewsMeter బృందం.. Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయడం ద్వారా పరిశోధనను ప్రారంభించింది. ఇది మార్చి 20, 2022న 'News18 గుజరాతీ' ప్రచురించిన నివేదికకు దారితీసింది. వైరల్ వీడియో కు సంబంధించిన స్క్రీన్‌ షాట్ కూడా ప్రచురించబడింది.

అంతేకాకుండా కాకుండా, ఈ సంఘటన యొక్క ట్వీట్‌ను కూడా 'న్యూస్ 18 గుజరాతీ' ట్విట్టర్ హ్యాండిల్‌లో మార్చి 20, 2022న షేర్ చేసింది.

'BKB Gujarati News' అనే యూట్యూబ్ ఛానల్ లో కూడా అందుకు సంబంధించిన వీడియోను మనం చూడవచ్చు.

కాబట్టి వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పుదారి పట్టించేవి. ఈ ఘటనకు హిందూ-ముస్లింల మధ్య ఘర్షణ అని ఎక్కడా నివేదిక కానీ.. వీడియో వివరణలో కానీ పేర్కొనలేదు.






































Claim Review:'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా చూసొచ్చాక హిందువులు.. ముస్లింలపై దాడులు చేశారా..?
Claimed By:Social Media Users
Claim Fact Check:False
Next Story