ఓ ఫుట్‌బాల్ క్రీడాకారుడు పాలస్తీనా జెండాను ఊపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇజ్రాయెల్- హమాస్ మధ్య కొనసాగుతున్న వివాదం మధ్య పాలస్తీనియన్లకు మద్దతుగా క్రిస్టియానో రొనాల్డో జెండాను ఊపుతున్నాడని సోషల్ మీడియా వినియోగదారులు చెబుతున్నారు.
“Ronaldo Supports Palestine #Palestine #IsraelPalestineWar #israel #FreePalestine #Gaza #GazaUnderAttack #Hamasattack.” అంటూ ట్విట్టర్ వినియోగదారులు పోస్టులు పెడుతున్నారు.
ట్విట్టర్, ఫేస్ బుక్ లో ఈ వీడియో వైరల్ అవుతూ ఉంది.
నిజ నిర్ధారణ :
FIFA ఖతార్ ప్రపంచ కప్ 2022 సమయంలో మొరాకో ఫుట్‌బాల్ క్రీడాకారుడు జవాద్ ఎల్ యామిక్ జెండాను ఊపుతున్నట్లు వీడియోలో ఉందని న్యూస్‌మీటర్ కనుగొంది.
మేము వైరల్ పోస్ట్‌లలో ఒకదాని కింద ఉన్న కామెంట్లను పరిశీలించాం. చాలా మంది ఈ వీడియోలో ఉన్నది మొరాకో జట్టు డిఫెండర్ జవాద్ ఎల్ యామిక్ అని తెలిపారు.
దీన్ని క్యూ గా తీసుకుని మేము కీవర్డ్ సెర్చ్ ను అమలు చేసాము. వరల్డ్ కప్ లో మొరాకో కు జవాద్ ఎల్ యామిక్ పాలస్తీనా జెండాతో కెనడాపై విజయాన్ని సెలెబ్రేట్ చేసుకున్నాడని చెబుతూ.. డిసెంబర్ 2, 2022న వెరిఫైడ్ ఛానెల్, మిడిల్ ఈస్ట్ ఐ ప్రచురించిన వీడియోను మేము YouTubeలో కనుగొన్నాము. వైరల్ వీడియో కంటే ఈ వీడియో నిడివి ఎక్కువగా ఉంది.
వీడియో వివరణలో "మొరాకో ఆటగాడు జవాద్ ఎల్ యామిక్ కెనడాపై తమ జట్టు విజయం సాధించగానే పాలస్తీనా జెండాతో సంబరాలు చేసుకున్నాడు." అని ఉంది.
డిసెంబర్ 2, 2022న 4టీవీ న్యూస్ ఛానెల్, దోహా న్యూస్ అఫీషియల్ ప్రచురించిన వీడియోను కూడా మేము కనుగొన్నాము. మొరాకో ఆటగాడు జవాద్ ఎల్ యామిక్ పాలస్తీనా జెండాను ఊపుతున్నట్లు వీడియోలో ఉందని ఈ రెండు ఛానెల్‌లు నివేదించాయి.
డిసెంబర్ 7, 2022 నాటి CNN నివేదిక ప్రకారం కెనడాపై 2-1తో మొరాకో విజయం సాధించగా జవాద్ ఎల్ యామిక్ పాలస్తీనా జెండాను ఎగురవేశారు.
కాబట్టి, వైరల్ వీడియోలో ఉన్నది క్రిస్టియానో రొనాల్డో కాదు. మొరాకో ఆటగాడు జవాద్ ఎల్ యామిక్. రొనాల్డో పాలస్తీనా జెండాను ఊపలేదు. వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.
Credits : Md Mahfooz Alam