తెలంగాణ బీజేపీ నేత టి.రాజా సింగ్ మేనల్లుడు ఇస్లాం మతంలోకి మారాడంటూ ఎన్.ఆర్.క్యూ. న్యూస్ లోగోతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో, తనను తాను సయ్యదా నహీదా క్వాద్రీగా చెప్పుకున్న ఒక మహిళ, రాజా సింగ్ గురించి ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోందని చెప్పడం వినవచ్చు. రాజా సింగ్ మేనల్లుడు శివ సింగ్ ఇస్లాంను స్వీకరించాడని ఆమె చెప్పింది. శివ సింగ్ తన పేరును మహ్మద్ సిద్ధిఖ్‌గా మార్చుకున్నాడని ఆమె పేర్కొంది. వీడియోలో ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ కూడా ఉంది. వారిలో ఒకరు తాను రాజా సింగ్ మేనల్లుడు శివ సింగ్ అని, ఇస్లాం స్వీకరించానని చెప్పడం వినవచ్చు.
ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హైదరాబాద్‌లోని గోషామహల్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను ఆగస్టు 25 న పోలీసులు అరెస్టు చేసిన తర్వాత.. వీడియో వైరల్‌గా మారింది. కోర్టు విధించిన బెయిల్ షరతులను ఎమ్మెల్యే ఉల్లంఘించారని కూడా తెలుస్తోంది. బీజేపీ కూడా రాజా సింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
నిజ నిర్ధారణ :
NewsMeter బృందం కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించింది. సెప్టెంబర్ 7న ది హిందూలో ప్రచురించబడిన కథనాన్ని కనుగొంది. వైరల్ వీడియోలో రాజా సింగ్ మేనల్లుడు అని చెప్పుకున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు ది హిందూ నివేదించింది. రాజా సింగ్ అసలు మేనల్లుడు కార్వాన్ నివాసి పి. సునీల్ సింగ్ చేసిన ఫిర్యాదు మేరకు, సైబర్ క్రైమ్ పోలీసులు సెప్టెంబర్ 7న ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 153 (A) మరియు 505 (2) కింద కేసు నమోదు చేశారు.
వీడియోలో మాట్లాడుతున్న ఇద్దరు వ్యక్తులు ఇసా మిస్రీ, మహ్మద్ సిద్ధిఖీ అని ఫిర్యాదుదారుని ఉటంకిస్తూ ఎఫ్ఐఆర్ పేర్కొంది.
వైరల్ వీడియోను ఫేక్ అని.. అలాగే రెచ్చగొట్టే విధంగా పేర్కొంటూ హైదరాబాద్ నగర పోలీసుల ధృవీకరించిన ట్విట్టర్ హ్యాండిల్ చేసిన ట్వీట్‌ను మేము కనుగొన్నాము. ట్వీట్‌లో సదరు వ్యక్తి రాజా సింగ్‌తో తన బంధుత్వం గురించి అబద్ధం చెప్పానని అంగీకరించిన వీడియో కూడా ఉంది. రాజా సింగ్ మేనల్లుడినని అబద్ధం చెప్పానని సదరు వ్యక్తి ఒప్పుకున్నాడు.
వైరల్ వీడియోలో చేసిన వాదనలు అవాస్తవమని స్పష్టమైంది.
2019లో, రాజా సింగ్ సోదరి ఇస్లాం మతంలోకి మారిందని ఇదే విధమైన ఫేక్ వార్త వైరల్ అయింది. అది కూడా అబద్ధమేనని తేలింది.