FactCheck : రంజాన్ సమయంలో ముస్లింలకు సహాయం చేసినందుకు ప్రధాని మోదీ ఫోటో బుర్జ్ ఖలీఫాపై..?

Did Burj Khalifa Display Modis Image to honour him for helping indian muslims during Ramzan. రంజాన్ సందర్భంగా భారతీయ ముస్లింల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం, సహాయం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 May 2022 1:59 PM GMT
FactCheck : రంజాన్ సమయంలో ముస్లింలకు సహాయం చేసినందుకు ప్రధాని మోదీ ఫోటో బుర్జ్ ఖలీఫాపై..?

రంజాన్ సందర్భంగా భారతీయ ముస్లింల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం, సహాయం చేసినందుకు రంజాన్ ఉపవాసం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని గౌరవించారని.. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


నిజ నిర్ధారణ :

బుర్జ్ ఖలీఫాలో డిజిటల్ స్క్రీన్ మీద మోదీపై ప్రశంసలు కురిపిస్తూ.. ఇటీవలి కాలంలో ఏవైనా వార్తలు వచ్చాయా అనే నివేదికల కోసం NewsMeter బృందం తనిఖీ చేసింది, కానీ ఏదీ కనుగొనబడలేదు. బుర్జ్ ఖలీఫా అధికారిక ట్విట్టర్ ఖాతాలో కూడా అలాంటి వార్తలేవీ కనిపించారు.

2018లో, ప్రధాని మోదీ UAE కు వెళ్లారు. ఆయన పర్యటన సందర్భంగా, బుర్జ్ ఖలీఫాను భారత జెండా రంగులతో వెలిగించారు.

మేము వైరల్ ఇమేజ్ ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. అదే ఫోటోను షట్టర్‌స్టాక్‌లో కనుగొన్నాము. వైరల్ ఇమేజ్, ఈ ఇమేజ్ మధ్య పోలిక చూడగా వైరల్ ఇమేజ్ ఎడిట్ చేయబడినట్లు తేలింది.


కాబట్టి వైరల్ అవుతున్న ఫోటో ఫేక్.. ఎడిట్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.


























Claim Review:రంజాన్ సమయంలో ముస్లింలకు సహాయం చేసినందుకు ప్రధాని మోదీ ఫోటో బుర్జ్ ఖలీఫాపై..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media Users
Claim Fact Check:False
Next Story