Fact Check : 2025 కల్లా భారత్ హిందూ దేశమవుతుందని అమిత్ షా చెప్పారా..?
Did Amit Shah Say India Will Become Hindu Nation By 2025. `National India News' అనే మీడియా సంస్థకు చెందిన న్యూస్ బులిటెన్ కు చెందిన స్క్రీన్ షాట్
By న్యూస్‌మీటర్ తెలుగు
`National India News' అనే మీడియా సంస్థకు చెందిన న్యూస్ బులిటెన్ కు చెందిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అందులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోటో కూడా ఉంది. 2025 కల్లా భారత్ హిందూ దేశమవుతుందని అమిత్ షా చెప్పినట్లుగా కథనం ఉంది. దీన్ని పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ ఉన్నారు.
హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేసినట్లు చిత్రాన్ని కూడా కలిగి ఉంది.
"సనాతన ధర్మంతో సంబంధం ఉన్న వ్యక్తులందరికీ అభినందనలు. మీ అన్నయ్య చెబుతున్నారు.. సన్నాహకాలు ప్రారంభించండి. 2025 ముందు కల్లా హిందూ దేశం ఏర్పడుతుంది" అని వైరల్ పోస్ట్ ను అనువదించడం జరిగింది.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.
న్యూస్ మీటర్ అమిత్ షా వ్యాఖ్యలపై గూగుల్ లో సెర్చ్ చేయగా.. ఇలాంటి వ్యాఖ్యలు అమిత్ షా చేయలేదని స్పష్టమైంది. ఈ కథనాలకు సంబంధించి ఏ మీడియా సంస్థ కూడా వార్తలను ప్రసారం చేయలేదు.
2019 లో షా ని ఆజ్ తక్ లో ఇంటర్వ్యూ చేసారు. "బీజేపీ భారతదేశాన్ని హిందూ దేశంగా భావిస్తుందా?" అని ప్రశ్నించగా.. అమిత్ షా మాట్లాడుతూ "అస్సలు కాదు. మేము రాజ్యాంగాన్ని నమ్ముతాము.. దానిని అంగీకరిస్తున్నాము. ఈ దేశంలో ప్రతి ఒక్కరూ ఏ మతాన్ని అయినా అనుసరించవచ్చు. వారికి పూర్తి స్వేచ్ఛ ఉంది." అని చెప్పుకొచ్చారు.
ఇండియా టుడే కూడా ఇంటర్వ్యూ గురించి నివేదించింది. హిందూ రాష్ట్ర ఆలోచనపై అమిత్ షాను అడిగినప్పుడు, "బీజేపీ భారత రాజ్యాంగాన్ని ఎంతో స్ఫూర్తితో అనుసరిస్తుంది. దేశం మరియు ప్రభుత్వం ఒకే మతాన్ని కలిగి ఉంటాయి - అదే రాజ్యాంగం." అని చెప్పారు.
నేషనల్ ఇండియా న్యూస్ యొక్క స్క్రీన్‌గ్రాబ్ అనేది పౌరసత్వ చట్టం మరియు భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చడం గురించి ప్రజాభిప్రాయాన్ని కోరుకునే ప్రసార చిత్రం. వైరల్ పోస్ట్‌లో ప్రశ్నకు సంబంధించిన గుర్తు కత్తిరించబడింది. ఆ తర్వాత దాన్ని ఎడిటింగ్ చేసి పోస్టును అప్లోడ్ చేశారు.
వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.