అండమాన్ నికోబార్ దీవుల పేరును కేంద్ర మంత్రి అమిత్ షా మార్చారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. అండమాన్ నికోబార్ దీవుల పేరును నేతాజీ సుభాష్ చంద్రబోస్ దీవులుగా మార్చారంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
ആൻഡമാൻ നിക്കോബാർ ദ്വീപ് ഇനിമുതൽ നേതാജി സുഭാഷ് ചന്ദ്ര ബോസ് ദ്വീപ് എന്നറിയപ്പെടും.. അമിത്ഷാ అంటూ ఓ పోస్టు వైరల్ అవుతోంది.
దీన్ని అనువదించగా.. అండమాన్ నికోబార్ దీవుల పేరు కాస్తా ఇకపై సుభాష్ చంద్రబోస్ దీవులుగా పిలవడం జరుగుతుంది: అమిత్ షా అన్నట్లు తెలిపారు.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
న్యూస్ మీటర్ ఈ విషయమై ఇంటర్నెట్ లో వెతకగా ఎక్కడ కూడా అండమాన్ నికోబార్ దీవుల పేరు మార్చినట్లుగా కథనాలు వెలువడలేదు. అమిత్ షా మూడు రోజుల టూర్ లో కూడా ఈ విషయం పై ఎటువంటి ప్రకటన చేయలేదు.
ఆ పర్యటనకు సంబంధించిన వార్తలను ఈ లింక్ లో చూడొచ్చు.
https://www.andaman.gov.in/about
మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కు సంబంధించిన ప్రకటనల్లో కూడా ఎక్కడ కూడా కనిపించలేదు.
https://pib.gov.in/Allrel.aspx
ఏదైనా ద్వీపానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని పేరు మార్చడం గురించి సంబంధిత కీలక పదాలతో మేము సెర్చ్ చేసాము. అండమాన్ నికోబార్‌లోని కొన్ని ద్వీపాల పునర్నిర్మాణంపై మా బృందం రెండు సంవత్సరాల మీడియా నివేదికలను చూసింది.
ఈ నివేదికల ప్రకారం, 2018 డిసెంబర్‌లో ప్రధాని మోదీ రాస్ ద్వీపం పేరును నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్‌గా మార్చారు. నేతాజీకి నివాళిగా మూడు దీవులకు భారత ప్రధాని నరేంద్ర మోదీ కొత్తగా పేర్లు పెట్టారు. నీల్ ద్వీపానికి షహీద్ ద్వీప్ మరియు హావ్లాక్ ద్వీపానికి స్వరాజ్ ద్వీపం అని పేరు పెట్టారు.
https://www.indiatoday.in/education-today/gk-current-affairs/story/andaman-nicobar-islands-renamed-pm-modi-netaji-bose-1420382-2018-12-31
https://economictimes.indiatimes.com/news/politics-and-nation/pm-modi-renames-3-islands-of-andaman-and-nicobar/articleshow/67311674.cms?from=mdr
అక్టోబర్ 16న MHA పత్రికా ప్రకటనను కనుగొన్నాము. తన పర్యటనలో అమిత్ షా షా అండమాన్ మరియు నికోబార్‌లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపంలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు, శంకుస్థాపన చేశారు.
https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1764396
అమిత్ షా కూడా తన ట్విట్టర్ ఖాతాలో అదే విషయాన్ని వెల్లడించారు.
అమిత్ షా అండమాన్ నికోబార్ దీవులను నేతాజీ సుభాష్ చంద్రబోస్ దీవులుగా పేరు మార్చలేదని స్పష్టమవుతోంది. 2018లో కేంద్రపాలిత ప్రాంతంలోని ఒక ద్వీపానికి నేతాజీ పేరు పెట్టారు.