అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ గురించి ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

"बंदा खुद टोपी नही पहनता, लेकिन 👉शेखों को भगवा 🔥पहनाकर आता हे जय श्री राम इंतजार करें ऐसे ही प्यार से हम अखंड भारत का सपना साकार कर लेंगे बिना गोली चलाई" అంటూ ఫేస్ బుక్ లో పోస్టులు పెట్టారు. ఎప్పుడూ ఎటువంటి నిబంధనలు పాటించని వ్యక్తి ఏకంగా కాషాయ వస్త్రాన్ని ధరించి వచ్చాడు అంటూ పోస్టులు పెట్టారు.

ఇంకొందరైతే 'అరబ్ యువరాజు ఏకంగా కాషాయ వస్త్రాలను ధరించాడు.. అదీ మోదీ అంటే' అని చెబుతూ పోస్టులను వైరల్ చేయడం మొదలుపెట్టారు.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న పోస్టుల్లో ఉన్న ఫోటోలను మార్ఫింగ్ చేశారు.

న్యూస్ మీటర్ వైరల్ ఫోటోలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. వీటిని మార్ఫింగ్ చేశారని స్పష్టంగా కనుక్కొంది. న్యూస్ మీటర్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించి, 2019 లో పోస్ట్ చేసిన ఇలాంటి చిత్రాన్ని కనుగొంది. అందులో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ వైరల్‌గా సర్క్యులేట్ అయిన చిత్రంలోని దుస్తులు ధరించలేదు. అసలైన ఫోటో లో కాషాయ దుస్తులు ధరించి కనిపించలేదు. అందువల్ల చిత్రం ఫోటో షాపింగ్ చేయబడిందని స్పష్టంగా తెలుస్తోంది.

నేషనల్ న్యూస్ యుఎఇ కథనంలో ఇదే విధమైన చిత్రం పోస్ట్ చేయబడింది. కథనం 2019 లో ప్రచురించబడింది. Orissadiary.com యొక్క కథనంలో, ఇదే విధమైన చిత్రం పోస్ట్ చేయబడింది మరియు కథనం 2019 లో ప్రచురించబడింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరియు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ పలు పరిణామాలపై మాట్లాడారు. ప్రపంచంలో తీవ్రవాదానికి చోటు లేదని తెలిపారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ కూడా చూడొచ్చు. 'ఆర్డర్ ఆఫ్ జాయెద్' అందుకోవడంపై మోదీ స్పందించారు. ఈ అవార్డు భారతదేశ సాంస్కృతిక నైతికతకు మరియు 130 కోట్ల మంది భారతీయులకు అంకితం చేయబడింది. ఈ గౌరవం కోసం నేను యుఎఇ ప్రభుత్వానికి కృతజ్ఞతలు" అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.


అప్పట్లో వీరి భేటీకి సంబంధించిన వీడియోలను యూట్యూబ్ లో పోస్టు చేశారు. వాటిలో కూడా అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ కాషాయం రంగు వస్త్రాలను ధరించినట్లు ఎటువంటి ఆధారాలు లేవు.

కాబట్టి వైరల్ అవుతున్న పోస్టుల్లో ఉన్నట్లుగా అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ ఎక్కడా కాషాయ వస్త్రాలు ధరించలేదు. వైరల్ ఫోటోలు మార్ఫింగ్ చేయబడినవి.


Claim Review :   మోదీని కలిసే సమయంలో అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ కాషాయవస్త్రాన్ని ధరించారా..?
Claimed By :  Social Media Users
Fact Check :  False

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story