పలువురు సోషల్ మీడియా వినియోగదారులు సీనియర్ రాజకీయ నాయకుడు 92 ఏళ్ల మోతీలాల్ వోరా రాహుల్ గాంధీని నమస్కరించి అతని పాదాలను తాకారంటూ ఆ చిత్రాన్ని షేర్ చేస్తూ ఉన్నారు.
తమిళంలో ఈ ఫోటో వైరల్ అవుతూ ఉంది. "మోతీలాల్ వోరా (92) రాహుల్ గాంధీ (51) కాళ్లపై పట్టారు. మన్మోహన్ సింగ్ (88) పూలను పట్టుకుని ఉన్నారు. అలా బానిసలుగా ఉన్నవారు మాత్రమే కాంగ్రెస్‌లో మనుగడ సాగిస్తారు" కాంగ్రెస్ బానిసలందరూ అగ్ర నాయకుల కాళ్ల మీద పడడానికి సిద్ధంగా ఉండాలి అంటూ పోస్టు వైరల్ అవుతూ ఉంది.
Archive links:
https://web.archive.org/web/20210804103705/https://twitter.com/vimal045Y/status/1421468183450427393
నిజ నిర్ధారణ:
చిత్రంలో కనిపించే సీనియర్ నాయకుడు మోతీలాల్ వోరా అనే వాదనలో ఎటువంటి నిజం లేదు.
న్యూస్ మీటర్ ఈ చిత్రం డిసెంబర్ 2018లో వచ్చినట్లు కనుగొంది. నివేదికల ప్రకారం వైరల్ చిత్రంలో ఉన్న వ్యక్తి మోతీలాల్ వోహ్రా కాదు. ఆయన T.S సింగ్ డియో. ఛత్తీస్‌గఢ్‌లో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా డియో ప్రమాణస్వీకారం చేసినప్పుడు ఈ ఫోటో తీయబడింది. డియో రాహుల్ గాంధీ పాదాలను తాకుతున్నారా అనేది ఖచ్చితంగా తెలియదు.
https://www.freepressjournal.in/viral/did-senior-congress-leader-motilal-vohra-bend-down-to-touch-rahul-gandhis-feet
2019 లో అనేక వెబ్‌సైట్‌లు దీనిపై కథనాలను ప్రచురించాయి. గతంలో చేసిన నిజ నిర్ధారణ కథనాల ఆధారంగా ఈ సంఘటన గురించి రెండు విభిన్న కథనాలు ఉన్నాయి.
ఫోటో తీసినప్పుడు ప్రమాణ స్వీకారోత్సవంలో రాయపూర్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. క్వింట్ మీడియా సంస్థతో జర్నలిస్ట్ మిస్టర్ డియో రాహుల్ గాంధీ పాదాలను తాకడానికి వంగలేదని.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేతిలో కనిపించే పూల గుత్తి నుండి బయటకు వచ్చిన దారం ముక్కను ఎంచుకున్నారని సీనియర్ జర్నలిస్ట్ చెప్పారు.
ఈ సంఘటనకు సంబంధించి ఇండియా టుడేతో మాట్లాడుతూ, మిస్టర్ సింగ్ డియో రాహుల్ పాదాలను తాకడానికి ప్రయత్నించాడనే వాదనలను ఖండించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆర్‌పిఎన్ సింగ్, మిస్టర్ డియో ప్రవేశద్వారం వద్ద రాహుల్ పాదాలను తాకడానికి ప్రయత్నించారని దాన్ని రాహుల్ గాంధీ అడ్డుకున్నారని చెప్పారు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉత్తర ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న భారత జాతీయ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మోతీలాల్ వోరా 21 డిసెంబర్ 2020 న 92 సంవత్సరాల వయసులో మరణించారు.
చిత్రంలో కనిపించే సంఘటన ఇటీవలిది కాదు. 92 ఏళ్ల మోతీలాల్ వోరా రాహుల్ గాంధీ పాదాలను తాకడానికి వంగి నమస్కరిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు.