Fact Check : కాబూల్ ఎయిర్ పోర్టు లోకి చొచ్చుకు రావడానికి అంతమంది ప్రయత్నించారా..?

Crowd Rushing To Watch NFl Game Passed Off as Chaotic Scene at Kabul Airport. ఆఫ్ఘనిస్తాన్ నుండి బయటపడాలని ఎంతో మంది ఎన్నో

By Medi Samrat  Published on  23 Aug 2021 9:09 AM IST
Fact Check : కాబూల్ ఎయిర్ పోర్టు లోకి చొచ్చుకు రావడానికి అంతమంది ప్రయత్నించారా..?

ఆఫ్ఘనిస్తాన్ నుండి బయటపడాలని ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు. అందుకు సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉన్నాయి. తాలిబ‌న్ల నుంచి త‌ప్పించుకుని దేశం విడిచి వెళ్లేందుకు వేలాది మంది ఆఫ్ఘన్ ప్ర‌జ‌లు కాబూల్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటున్నారు. వీరిని నియంత్రించేందుకు తాలిబ‌న్లు గాల్లోకి కాల్పులు జ‌రిపారు. దీంతో తొక్కిస‌లాట జ‌రిగింది. ఈ తొక్కిస‌లాట‌లో ఏడుగురు పౌరులు మృతి చెందిన‌ట్లు బ్రిట‌న్ ర‌క్ష‌ణ శాఖ వెల్ల‌డించింది. కాబూల్‌లో ప‌రిస్థితి ఇప్ప‌టికీ స‌వాలుగా ఉందని.. అయితే సాధ్య‌మైనంత సుర‌క్షితంగా ఉంచ‌డానికి మేము ప్ర‌య‌త్నిస్తున్నాం అని ఒక ప్ర‌క‌ట‌న‌లో బ్రిట‌న్ ర‌క్ష‌ణ శాఖ తెలిపింది.

ఇలాంటి పరిస్థితుల్లో మరో వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఒక్కసారిగా జనం ఓ అద్దాల బిల్డింగ్ లోకి దూసుకుని రావడాన్ని గమనించవచ్చు. ఇది కాబూల్ ఎయిర్ పోర్టులోని పరిస్థితి అని పలువురు చెప్పుకొచ్చారు.

Where is the UN. The superpowers. Why aren't all nations coming together to help them? This is so sad," along with hashtags #Afghanistan #Taliban #AfghanLivesMatter #USAabandonedAfghanistan #kabulairport అంటూ షేర్లు చేయడం మొదలు పెట్టారు.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.

ఒరిజినల్ వీడియోను జర్నలిస్ట్ జోన్ మచోటా, ది అథ్లెటిక్ కోసం డల్లాస్ కౌబాయ్‌ టీమ్ ను కవర్ చేసే స్టాఫ్ రైటర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ పోస్ట్ జనవరి 2019 న చోటు చేసుకుంది. NFL గేమ్(రగ్బీ) కోసం స్టేడియం తలుపులు తెరుచుకున్నా సమయంలోనిది. "కౌబాయ్స్ వర్సెస్ సీహాక్స్ కోసం AT&T స్టేడియం తలుపులు తెరవబడ్డాయి." అని క్యాప్షన్ ఉంది. స్టేడియం లోపలికి చేరుకోవడం కోసం ఇలా అభిమానులు దూసుకు వచ్చారు.

డల్లాస్ మార్నింగ్ న్యూస్ తన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోను పోస్ట్ చేసింది. NFL వైల్డ్ కార్డ్ ప్లేఆఫ్ గేమ్స్ గురించి చర్చించారు.

మాచోటా వీడియోను Sports Illustrated 2019 సంవత్సరంలో షేర్ చేసింది. NFL వైల్డ్ కార్డ్ ప్లే ఆఫ్ గేమ్ డల్లాస్ కౌబాయ్స్, సియాటెల్ సీహాక్స్ మధ్య టెక్సాస్ లోని ఏటీ అండ్ టి స్టేడియంలో చోటు చేసుకుంది.

కాబట్టి అమెరికాలోని స్టేడియంలో చోటు చేసుకున్న మ్యాచ్ కు సంబంధించిన వీడియోను ఆఫ్ఘనిస్తాన్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు అంటూ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు.


Claim Review:కాబూల్ ఎయిర్ పోర్టు లోకి చొచ్చుకు రావడానికి అంతమంది ప్రయత్నించారా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Insta, Twitter
Claim Fact Check:False
Next Story