భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వీడియోను కాంగ్రెస్ పార్టీ నేతలు విస్తృతంగా షేర్ చేస్తున్నారు. వీడియోలో నడ్డా, “బీజేపీ ప్రభుత్వం అంటే అత్యాచారం” అని చెప్పడం వినవచ్చు.
నడ్డా ఎట్టకేలకు నిజం మాట్లాడారని పేర్కొంటూ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ మీడియా కన్వీనర్ లలన్ కుమార్ వీడియోను షేర్ చేశారు.
అల్కా లాంబా, మను జైన్ వంటి ఇతర కాంగ్రెస్ నేతలు కూడా ఈ వీడియోను షేర్ చేశారు.
నిజ నిర్ధారణ :
న్యూస్‌మీటర్ బృందం వైరల్ వీడియోను ఎడిట్ చేశారని.. మిస్టర్ నడ్డా అలాంటి ప్రకటన చేయలేదని స్పష్టంగా గుర్తించింది.
అంతేకాకుండా లాలన్ కుమార్ వైరల్ పోస్ట్‌ను పరిశీలించాము. కరణ్ శర్మ అనే వినియోగదారు అదే వీడియోకు సంబంధించిన లాంగ్ వీడియోను పోస్ట్ చేసినట్లు కనుగొన్నాము. ఈ వీడియోలో నడ్డా, “సిపిఎం ప్రభుత్వం అంటే అత్యాచారాలు, మూసివేతలు, సమ్మెలు…” అని చెప్పడం వినవచ్చు.
దీనిని ఒక క్లూగా తీసుకుని, 12 జనవరి 2023న త్రిపురలోని అగర్తలాలో జరిగిన బహిరంగ సభలో నడ్డా చేసిన ప్రసంగం కనిపించింది. ఇందులో నుండి వచ్చినదే వైరల్ క్లిప్ అని మేము కనుగొన్నాము. 29:07 నిమిషాల మార్క్ వద్ద, నడ్డా మాట్లాడుతూ.. సీపీఎం ప్రభుత్వం అంటే అత్యాచారం.. మేము మొత్తం వీడియోను తనిఖీ చేసాము, ఎక్కడా బీజేపీ అంటే అత్యాచారం అని నడ్డా చెప్పలేదు.
ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రెండు క్లిప్‌లను విలీనం చేసినట్లు స్పష్టమవుతోంది. దావాలో ఎటువంటి నిజం లేదు.. వీడియో ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉందని మేము నిర్ధారించాము.