హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ ఆగస్టు 10న గుండెపోటుతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. వెంటిలేటర్‌పై ఉన్న ఆయన పరిస్థితి విషమంగా ఉంది. రాజు శ్రీవాస్తవ ఆరోగ్యం గురించి అందరూ ఆందోళన చెందుతుండగా.. ఆయన చనిపోయారంటూ.. వార్తా సంస్థ భారత్ 24, పలువురు సోషల్ మీడియా వినియోగదారులు పోస్టును పంచుకున్నారు. హాస్యనటుడికి బ్రెయిన్ డెడ్ అయ్యిందని ప్రచారం జరుగుతోంది.
ఆయన మరణవార్త తెలియగానే పలువురు ఆయనకు నివాళులర్పిస్తూ ట్వీట్లు చేశారు.
నిజ నిర్ధారణ :
హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ మరణాన్ని ధృవీకరించే నివేదికలను కనుగొనడానికి NewsMeter బృందం కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించింది. మాకు అలాంటి నివేదికలు ఏవీ కనుగొనబడలేదు. ఆయన మరణ వార్తను భారత్ 24 న్యూస్ ఆగస్టు 18న ప్రసారం చేసింది. శ్రీవాస్తవ పరిస్థితి విషమంగా ఉందని ఆగస్టు 19 నుండి వార్తలు వచ్చాయి. దీంతో భారత్ 24 నివేదిక నిరాధారమైనదని రుజువైంది.
రాజు శ్రీవాస్తవ మేనేజర్ పుకార్లను కొట్టిపారేశారు. రాజు శ్రీవాస్తవ బ్రెయిన్ డెడ్ కాలేదని ధృవీకరిస్తూ అనేక నివేదికలు కూడా మేము కనుగొన్నాము. ఆగస్టు 19న టైమ్స్ నౌ నివేదికలో రాజు శ్రీవాస్తవ మేనేజర్ మక్బూల్ మాట్లాడుతూ "బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు, వైద్యులు మాకు ఆయన పరిస్థితి విషమంగా ఉందని మాకు తెలియజేసారు, ఇప్పటికి 16 గంటలు అయ్యింది. వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచాడానికి ప్రయత్నిస్తున్నారు." అని అన్నారు.
హాస్యనటుడు సునీల్ పాల్ కూడా చనిపోయినట్లు వస్తున్న పుకార్లను కొట్టిపారేశారు. శ్రీవాస్తవ త్వరగా కోలుకోవాలని.. ఆరోగ్యం మెరుగుపడాలని ఆకాంక్షించారు.
రాజు శ్రీవాస్తవ మరణం గురించి వచ్చిన పుకార్లను ఖండిస్తూ చేసిన ట్వీట్లను కూడా కనుగొన్నాము.
హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ మరణ వార్త బూటకమని, వార్తల్లో ఎటువంటి నిజం లేదని తేలింది.