కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు రోడ్ల మీదకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే..! వివాదాస్పద సాగు చట్టాల అమలును 18నెలల పాటు నిలిపివేయడంతో పాటు చర్చల కోసం ఇరుపక్షాల నుంచి జాయింట్ కమిటీ ఏర్పాటు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించాయి. ఆ ప్రతిపాదనలు తమకు ఆమోదయోగ్యం కాదని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. ప్రభుత్వానికి-రైతు సంఘాలకు మధ్య చర్చలు ఇంకా కొలిక్కి రావడం లేదు.
రైతుల ఉద్యమానికి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. తాజాగా సోషల్ మీడియాలో రైతులకు మద్దతుగా కోకా కోలా కంపెనీ ప్రచారాన్ని మొదలుపెట్టింది అంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు. కోకా కోలా బాటిల్స్ మీద 'కిసాన్ ఐక్యత', 'సపోర్ట్ ఫార్మర్స్' అని రాసి ఉంది. రైతులకు కోకా కోలా మద్దతుగా ఉందని ఈ పోస్టుల ద్వారా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ బాటిల్స్ కు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతూ ఉన్నాయి.
నిజ నిర్ధారణ:
కోకా కోలా రైతులకు మద్దతుగా బాటిల్స్ మీద 'కిసాన్ ఐక్యత', 'సపోర్ట్ ఫార్మర్స్' అని ఉంచుతోంది అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
కోకా కోలా రైతులకు మద్దతుగా ఇలా ప్రచారం చేస్తోంది అనేట్టుగా ఏ వెబ్సైట్ లో కూడా పోస్టులు పెట్టలేదు. కోక్ బాటిల్ లేబుల్స్ మీద ఉన్న పోస్టుల్లో ఇలాంటివి రాశామని కంపెనీ కూడా చెప్పలేదు. ఏ వెబ్ సైట్ లో కూడా అందుకు సంబంధించిన పోస్టులు కనిపించలేదు
సామాజిక మాధ్యమాల్లో ఎటువంటి పోస్టులు కూడా కోకా కోలా కంపెనీ చేయలేదు
'share a coke' క్యాంపెయిన్ ను భారత్ లో 2018లో కోకా కోలా కంపెనీ మొదలుపెట్టింది. బాటిల్స్ మీద "Grandad (Old School. Yet Cool), Grandma (Scolds me. Spoils me), Daddy (My teacher. My friend)" వంటి వాటిని ఉంచేవారు. అంతేకానీ కంపెనీ రైతులకు మద్దతుగా ఇలాంటి బాటిల్స్ ను తీసుకుని రాలేదు. కోకా-కోలా కూడా ఈ పోస్టులను ఖండించింది.
Boomlive, The Quint సంస్థలు కూడా ఈ పోస్టుల్లో ఎటువంటి నిజం లేదని తెలిపాయి.
రైతులకు మద్దతుగా కోకా కోలా కంపెనీ బాటిల్స్ మీద లేబుల్స్ ను తీసుకుని వచ్చిందంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.