ఊరేగింపులో శిలువలతో తెల్లటి జెండాలతో అలంకరించబడిన రథానికి సంబంధించిన 15 సెకన్ల క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆంధ్ర ప్రదేశ్‌లో శ్రీనివాసుడి ఊరేగింపులో క్రైస్తవ జెండాలను ఎగురవేసినట్లు వినియోగదారులు పేర్కొన్నారు.
'మిషన్ కాళి' అనే ట్విటర్ యూజర్.. "ఆంధ్రప్రదేశ్‌లో క్రిస్టియన్ క్రాస్ జెండాలతో శ్రీ వేంకటేశ్వరుడి ఊరేగింపు. వాహ్ క్యా సెక్యులరిజం హై" అనే టెక్స్ట్‌తో వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోకు వేలల్లో వ్యూస్, వందల్లో రీట్వీట్లు దక్కాయి.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న వీడియోకు.. శ్రీనివాసుడి ఊరేగింపుకు ఎటువంటి సంబంధం లేదు.
NewsMeter రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను నిర్వహించింది. నవంబర్ 6, 2021న ABN తెలుగు మీడియా ఛానల్స్ రిపోర్ట్‌లో ఇలాంటి విజువల్స్ కనిపించాయి. ఈ వైరల్ వీడియోలో ఉన్న రథానికి సంబంధించిన ఊరేగింపు విజువల్స్ ఇందులో కూడా ఉన్నాయి. "అమరావతి రైతుల మహా పాదయాత్ర @ ప్రకాశం జిల్లా" అనే క్యాప్షన్‌తో వీడియో ప్రచురించబడింది.
దీన్ని హింట్ గా భావించి, NewsMeter అమరావతి రైతుల మహా పాదయాత్రపై నివేదికల కోసం ఆన్‌లైన్‌లో వెతికింది. నవంబర్ 8న రథం చిత్రాన్ని కలిగి ఉన్న హన్స్ ఇండియా నివేదికను కనుగొంది. ఇక్కడ రథంపై మూడు రంగుల జెండాలు ఎగురవేయడం స్పష్టంగా కనిపిస్తుంది - కుంకుమ, ఆకుపచ్చ మరియు తెల్లని జెండా. దేశంలోని అన్ని ప్రధాన మతాల జెండాలను ఎగురవేశారు. 'ఈనాడు' ప్రచురించిన నివేదికలో కూడా ఇదే విషయాన్ని గమనించవచ్చు.
అమరావతి 'మహా పాదయాత్ర' ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ అమరావతిలోని 29 గ్రామాల రైతులతో కూడిన బృందం 45 రోజుల పాటూ నిరసన తెలియజేయనున్నారు. తుళ్లూరి గ్రామం వద్ద ప్రారంభమైన నిరసనలో రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ పెద్ద సంఖ్యలో రైతులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు. రాజధాని నిర్మాణం కోసం తమ భూముల్లో 33 వేల ఎకరాలను స్వచ్ఛందంగా వదులుకున్నామని రైతులు తెలిపారు.
రథం చిత్రం నిజంగా అమరావతి 'మహా పాదయాత్ర' సమయంలో తీయబడినదని ధృవీకరిస్తూ ది హిందూ, ఈటీవీ మరియు ఆంధ్రప్రదేశ్ వంటి ఇతర మీడియా సంస్థలు కూడా ఇలాంటి విజువల్స్‌ను ప్రసారం చేశాయి.
శ్రీనివాసుడి ఊరేగింపులో రథంపై శిలువతో కూడిన క్రైస్తవ జెండాను ఎగురవేయలేదు. ఈ వీడియో క్లిప్ అమరావతి 'మహా పాదయాత్ర' కు సంబంధించింది. దీనిపై దేశంలోని అన్ని ప్రధాన మతాల జెండాలు ఉన్నాయి.
కాబట్టి వైరల్ పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.