FactCheck : టీటీడీ చీఫ్ బీఆర్ నాయుడు కార్యాలయంలో క్రైస్తవ శిలువ ఉందా.?
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు ఛైర్మన్‌గా తెలుగు ఛానల్ TV5 వ్యవస్థాపకుడు BR నాయుడు నియమితులయ్యారు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 1 Nov 2024 3:00 PM GMTతిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు ఛైర్మన్‌గా తెలుగు ఛానల్ TV5 వ్యవస్థాపకుడు BR నాయుడు నియమితులయ్యారు, తిరుమల ఆలయ వ్యవహారాల నిర్వహణ బాధ్యత ఆయన తీసుకున్నారు.తిరుమల ప్రసాదం లడ్డూలలో కల్తీ జరిగిందని ఆరోపించిన సమయంలో ఆయన నియామకం జరిగింది.
ఈ నేపథ్యంలో బీఆర్ నాయుడు కార్యాలయంలో ఓ ట్రోఫీపై శిలువ ఉన్న చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రం విమర్శలకు దారితీసింది. కొందరు బీఆర్ నాయుడు క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. హిందూ సంస్థకు ఒక క్రైస్తవుడిని ఎలా నియమిస్తారని పలువురు పోస్టులు పెట్టారు.
ఫేస్‌బుక్ వినియోగదారు ఈ చిత్రాన్ని షేర్ చేస్తూ “క్రైస్తవ మతాన్ని అనుసరించే BR నాయుడుకి ఈ బాధ్యతలు ఎలా ఇచ్చారు? ఇదేనా నా సనాతన హిందూ ధర్మం?” (ఆర్కైవ్) అంటూ పోస్టులు పెట్టారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
చిత్రం ఎడిట్ చేశారని, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని NewsMeter కనుగొంది. అసలు చిత్రంలో ట్రోఫీపై క్రాస్ ఉండదు.
మేము సంబంధిత కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము. TTD ఛైర్మన్‌గా నియమితులైనందుకు BR నాయుడును అభినందిస్తూ అతనితో పోజులిచ్చిన మరొక వ్యక్తికి సంబంధించిన చిత్రం కనుగొన్నాం. ఈ ఫోటోను అక్టోబర్ 30న Instagramలో పోస్ట్ చేశారు. ఈ చిత్రం బీఆర్ నాయుడు కార్యాలయంలో అదే ట్రోఫీని చూపింది కానీ క్రాస్ కనిపించలేదు.
మేము BR నాయుడు అదే చోట మరొకరు తీసుకున్న చిత్రాన్ని కూడా కనుగొన్నాము. టీటీడీ చైర్మన్‌గా నియమితులైన ఆయనను అభినందించడం చూడొచ్చు. అదే ట్రోఫీ చిత్రంలో కూడా కనిపిస్తుంది, కానీ ఆందులో క్రాస్ లేదు.
రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని నిర్వహించినప్పుడు, అక్టోబర్ 30న X వినియోగదారు పోస్ట్ చేసిన వైరల్ ఇమేజ్ అన్‌క్రాప్డ్ వెర్షన్‌ని మేము కనుగొన్నాము. ఈ చిత్రం కూడా ట్రోఫీపై క్రాస్ కనిపించదు.
ట్రోఫీకి సంబంధించిన చిత్రం, బీఆర్ నాయుడుతో ఒక వ్యక్తి పోజులివ్వడం, అతని కార్యాలయంలో పుష్పగుచ్ఛం పట్టుకొని ఉన్న మరొక ఫోటోను కూడా మేము పొందాము. రెండు చిత్రాలలో, ట్రోఫీ కనిపిస్తుంది కానీ.. అందులో క్రాస్ కనిపించలేదు.
కాబట్టి, BR నాయుడు కార్యాలయంలో క్రాస్‌తో ఉన్న ట్రోఫీని వైరల్ ఇమేజ్ లో ఎడిట్ చేశారని మేము నిర్ధారించాము.
Credits : Md Mahfooz Alam