సముద్రంలో ఓ భారీ ఆకారంలో ఉన్న జీవి ఈదుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. హెలికాప్టర్లు ఎగురుతున్నట్లు వీడియోలో కనిపించింది.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడింది. దీనిపై పుకార్లు, తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతూ ఉంది.
నిజ నిర్ధారణ :
NewsMeter బృందం రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని నిర్వహించింది. క్లెయిమ్‌కు మద్దతు ఇవ్వడానికి సంబంధిత ఆధారాలు ఏవీ కనుగొనబడలేదు. ఇలాంటి వింత జీవి.. భారీగా ఉన్న జీవిని కనుగొన్నట్లు ఎటువంటి కథనాలు కనిపించాలేదు. నిశితంగా వీడియోను పరిశీలిస్తే ఇది తప్పనిసరిగా కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించి తయారు చేసిందని మేము గుర్తించాం.
మేము వీడియోను విశ్లేషించాము. భారతదేశంలో నిషేధించబడిన TikTok లో వైరల్ అవుతోందని కనుగొన్నాము. వీడియోలో కనిపించే TikTok వినియోగదారు పేరు "borisao_blois"ని కూడా మేము గమనించాము. దీన్ని క్లూగా తీసుకొని, మేము కీవర్డ్ శోధనను అమలు చేసాము. అదే వినియోగదారు పేరుతో YouTube ఛానెల్‌ని కనుగొన్నాము. అదే వీడియో, 'The Bloop vs The Great Majah - The Meeting Day' పేరుతో, ఛానెల్‌లో 30 జూన్ 2022న అప్‌లోడ్ చేయబడింది. "The day of the meeting has arrived…Several dozen underwater drones, an aerial team of helicopters, many cameras and hydrophones; everything is ready to capture the moment. The suspected battle is about to begin and the whole world is watching. The Bloop finally comes face to face with El Gran Majá and the tense atmosphere shakes everybody, shakes every breath. Very soon the battle will be here on YouTube my people." అంటూ డిస్క్రిప్షన్ లో ఉంది.
మేము YouTube పేజీని తనిఖీ చేసాము. వింతగా.. కల్పితమైన జీవులకు సంబంధించిన వీడియోలను కనుగొన్నాము. ఛానెల్‌లోని ఎబౌట్ సెక్షన్‌లో, "నేను కొత్త కథలు చెప్పాలని అనుకునే కోరిక ఉన్న వ్యక్తిని, నా చేతిలో యానిమేషన్ అనే ఆయుధాన్ని కలిగి ఉన్నాను." అని చెప్పుకొచ్చాడు. ఈ ఛానెల్ కాల్పనిక, CGI యానిమేటెడ్ వీడియోలతో నిండి ఉందని మేము గుర్తించాం.
కళాకారుడి ఇంస్టాగ్రామ్ ఖాతాలో 3D యానిమేటర్ అని ఉంది. borisao_blois అనేది సదరు వ్యక్తి Instagram ఖాతా.
కాబట్టి, వైరల్ అవుతున్న వీడియో యానిమేషన్ ద్వారా తయారు చేసినది.