ప్రతి పౌరుడికి COVID-19 సహాయ నిధిగా రూ. 5,000 ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని సోషల్ మీడియా వినియోగదారులు ఒక పోస్ట్‌ను షేర్ చేస్తున్నారు. ఆ వైరల్ మెసేజీలో ఓ లింక్ ఉంటుంది. లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా వ్యక్తులు తక్షణమే మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చని యూజర్లు చెబుతున్నారు.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.
మేము వైరల్ పోస్ట్‌కి జోడించిన లింక్‌ని ఓపెన్ చేసినప్పుడు, అది మమ్మల్ని ఓ వెబ్‌సైట్‌కి మళ్లించింది. ఈ చిరునామా (డొమైన్) ప్రభుత్వ వెబ్‌సైట్‌ల కంటే భిన్నంగా ఉంటుంది. ప్రభుత్వం సైట్లు సాధారణంగా 'gov. in', 'nic. in' ఇలా ఉంటాయి.
ఒక వ్యక్తి వెబ్‌సైట్‌ను ఎన్నిసార్లు ఓపెన్ చేసినా.. పేజీ లో '1936 ఉచిత లాక్‌డౌన్ ప్యాకేజీలను ఉన్నాయి'.('Left 1936 FREE lockdown packages') అనే మెసేజీని మనం చూడవచ్చు.
సర్వే పూర్తయిన తర్వాత కామెంట్లు ప్రదర్శించబడ్డాయి. వినియోగదారులు వెబ్‌సైట్ నుండి ప్రయోజనాలను పొందినట్లు అందులో పేర్కొన్నారు. వెబ్‌సైట్‌ను ఎన్నిసార్లు సందర్శించినా, 'లబ్దిదారులు', 'టైమ్‌స్టాంప్' పేర్లు స్థిరంగా ఉన్నాయి. అలాగే లైక్స్, కామెంట్‌ల సంఖ్య స్థిరంగా ఉంది.
ప్రయోజనాలను పొందేందుకు, వినియోగదారులు సర్వే పూర్తీ చేశాక.. WhatsApp సమూహాలలో వెబ్‌సైట్‌ను తప్పనిసరిగా షేర్ చేయాలి. ప్రభుత్వ వెబ్‌సైట్ తన పథకాల కోసం అటువంటి చర్యలను చేపట్టే ఛాన్స్ ఉండదు.
https://worksandhousing.gov.ng/css2/images/SealNigerianPresident.png
కాబట్టి.. ఈ వైరల్ పోస్టుకు భారత్ కు ఎటువంటి సంబంధం లేదు. వినియోగదారుల డేటాను దొంగిలించడానికి ఇలాంటి ఎన్నో మెసేజీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.