FactCheck : పేద ప్రజలకు కేంద్ర ప్రభుత్వం 30,628 రూపాయలు ఇస్తూ ఉందా..?

Centre is not giving away rs 30628 to poor citizens viral message is hoax. ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన లింక్ అంటూ.. ఓ మెసేజీ వాట్సాప్‌లో వైరల్ అవుతోంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 May 2022 4:04 PM GMT
FactCheck : పేద ప్రజలకు కేంద్ర ప్రభుత్వం 30,628 రూపాయలు ఇస్తూ ఉందా..?

ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన లింక్ అంటూ.. ఓ మెసేజీ వాట్సాప్‌లో వైరల్ అవుతోంది. ప్రభుత్వం పెరుగుతున్న ధరల దృష్ట్యా ఎంపిక చేసిన పౌరులకు 30,628 రూపాయలు అందించబోతోంది.

సందేశం ఇలా ఉంది, "ధరల పెరుగుదల తర్వాత, సంక్షోభాన్ని అధిగమించడానికి పేద తరగతికి సహాయంగా పరిస్థితులను ఎదుర్కొనేలా.. ప్రతి పౌరుడికి 30628 రూపాయలు మొత్తాన్ని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది." అని ఉంది. "After the surge in prices, the government decided to give the Indian people an amount of ₹30628 for every citizen who meets the conditions as an aid to the poor class to overcome the crisis (sic)." అని పోస్టును వైరల్ చేస్తూ ఉన్నారు.


నిజ నిర్ధారణ :

వైరల్ అవుతున్న పోస్టులో 'ఎటువంటి నిజం లేదు'.

మేము లింక్‌ను క్లిక్ చేసినప్పుడు, మేము ఆర్థిక మంత్రిత్వ శాఖ పేరు, దాని లోగో ఉన్న పేజీలోకి వెళ్ళింది. అయితే, URL ప్రామాణికమైనది కాదు. ఇది బ్లాగింగ్ వెబ్‌సైట్ Blogspotకి చెందినది. ఆర్థిక మంత్రిత్వ శాఖ నిజమైన వెబ్‌సైట్ లింక్ https://finmin.nic.in/ అని మీరు గుర్తించాలి.



డబ్బును పొందడానికి వెబ్‌సైట్ లో పేర్లను నమోదు చేయాలని, వాట్సాప్ గ్రూపులలో సందేశాన్ని షేర్ చేయాలని కోరింది. యూజర్ యొక్క IP చిరునామాకు కనెక్ట్ చేయడం ద్వారా ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌ల నుండి సమాచారాన్ని హ్యాక్ చేయడానికి, దొంగిలించడానికి ఈ పద్ధతి సాధారణంగా ఉపయోగించబడుతుందని గమనించాలి.



ఆర్థిక మంత్రిత్వ శాఖ అటువంటి స్కీమ్ ఏదీ ప్రకటించలేదు. ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు పేద ప్రజలకు డబ్బు అందజేస్తామని మంత్రిత్వ శాఖ ద్వారా ఎలాంటి వార్తా నివేదికలు, అధికారిక ప్రకటనలు మాకు ఎటువంటి వార్తా కథనాల్లోనూ కనిపించలేదు.

వైరల్ లింక్ బూటకమని స్పష్టమైంది. ఇలాంటి లింక్ లను క్లిక్ చేయకండి.































Claim Review:పేద ప్రజలకు కేంద్ర ప్రభుత్వం 30,628 రూపాయలు ఇస్తూ ఉందా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media Users
Claim Fact Check:False
Next Story