FactCheck : ఆ ఘోర యాక్సిడెంట్ హైదరాబాద్ లో చోటు చేసుకున్నదే

Car crash is from hyderabad india not hyderabad pakistan. ఓ కారు ఇద్దరు మహిళలను వేగంగా ఢీకొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 July 2023 7:16 PM IST
FactCheck : ఆ ఘోర యాక్సిడెంట్ హైదరాబాద్ లో చోటు చేసుకున్నదే

ఓ కారు ఇద్దరు మహిళలను వేగంగా ఢీకొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో మహిళలు నడుచుకుంటూ వెళుతూ ఉండగా.. ఒక్కసారిగా కారు ఢీకొట్టగానే వాళ్లంతా గాల్లోకి ఎగిరిపోయారు.


@Karachi_Update అనే ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్టు చేశారు. “వైరల్ వీడియో: హైదరాబాద్‌లో హృదయ విదారక ప్రమాదం, మార్నింగ్ వాక్ చేస్తున్న ముగ్గురిని వేగంగా దూసుకుని వచ్చిన కారు ఢీకొట్టింది.. భయంకరమైన కారు ప్రమాదానికి సంబంధించిన చిన్న క్లిప్ ఇది. ఈ వీడియో పాకిస్థాన్‌లోని హైదరాబాద్‌కు చెందినది" అంటూ ట్విట్టర్ హ్యాండిల్ లో పేర్కొన్నారు.

నిజ నిర్ధారణ :

ఈ ప్రమాదం పాకిస్థాన్‌లో చోటు చేసుకున్నదనే వాదనలో ఎటువంటి నిజం లేదు. భారతదేశంలోని తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో జరిగిందని న్యూస్‌మీటర్ గుర్తించింది.

జూలై 4, 2023న ఇద్దరు ప్రాణాలను బలిగొన్న కారు ప్రమాదంపై న్యూస్‌మీటర్ నివేదించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మరొకరికి గాయాలయ్యాయి. మద్యం మత్తులో ఉన్న 19 యువకుడు అతి వేగంతో కారు నడిపిన కారణంగా ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ శివార్లలోని బండ్లగూడ జాగీర్‌లోని హైదర్ షా కోటే ప్రధాన రహదారి వద్ద తెల్లవారుజామున 5:30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.

అదే నివేదికను న్యూస్‌మీటర్ యూట్యూబ్ ఛానెల్‌లో కూడా చూడవచ్చు.


మరింత ధృవీకరణ కోసం, మింట్, ఇండియా టుడే, NDTV వంటి బహుళ మీడియా సంస్థలలో భారతదేశంలోని హైదరాబాద్ నగరంలో ఈ కారు ప్రమాదం జరిగిందనే నివేదికను కూడా మేము కనుగొన్నాము.

కరాచీ అప్‌డేట్ ట్విటర్ హ్యాండిల్ ఈ వీడియోను పాకిస్తాన్ లో ఉన్న హైదరాబాద్ నగరానిదని తప్పుగా నివేదించినట్లు తెలుస్తుంది. అయితే ఇది భారతదేశంలోని హైదరాబాద్‌లో చోటు చేసుకున్న సంఘటన.

Credits : Sunanda Naik



Claim Review:ఆ ఘోర యాక్సిడెంట్ హైదరాబాద్ లో చోటు చేసుకున్నదే
Claimed By:Socialmedia Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Twitter
Claim Fact Check:False
Next Story