ఇంజినీరింగ్ చదివేందుకు కామర్స్ విద్యార్థులకు కేంద్రం అవకాశాలు కల్పిస్తోందని సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొంటున్నారు. అందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
"కేంద్రం కామర్స్ విధ్యార్ధులు కూడా ఇంజనీరింగ్ చదవడానికి అవకాశం ఇచ్చింది.
ఈ విషయం బహుశా ఏ ప్రాంతీయ పత్రికా చెప్పి ఉండదు.
ఎవరైనా ఔత్సాహికులు ఇంజనీరింగ్ చదవాలని ఉండి కేవలం cec, hec తీసుకొన్నందువల్ల చేయలేమని బాధ పడుతుంటే వారికి ఈ విషయం చెప్పండి." అంటూ పోస్టులను వైరల్ చేస్తూ ఉన్నారు.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి.
ఇంజినీరింగ్ మరియు మేనేజ్‌మెంట్ వంటి సాంకేతిక విద్యా కార్యక్రమాలకు సంబంధించిన అపెక్స్ బాడీ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) యొక్క కొత్త నిబంధనల గురించి వివరించిన ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనాన్ని NewsMeter బృందం కనుగొంది.
ఇంతకుముందు, ఇంజినీరింగ్ చేయాలనుకునే వారు అవసరమైన సబ్జెక్టుల ప్రకారం ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌తో కలిపి హైస్కూల్ పూర్తి చేసి ఉండాలి. కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేటిక్స్ ప్రాక్టీసెస్, అగ్రికల్చర్, ఇంజినీరింగ్ గ్రాఫిక్స్, బిజినెస్ స్టడీస్, టెక్నికల్ వొకేషనల్ సబ్జెక్టులు మూడో సబ్జెక్ట్‌గా ఉండవచ్చు. జనరల్ కేటగిరీ అభ్యర్థి మూడు సబ్జెక్టుల్లో కనీసం 45 శాతం సాధించి ఉండాలి.
AICTE అప్రూవల్ ప్రాసెస్ హ్యాండ్‌బుక్ 2021-22 ప్రకారం, XI మరియు XII తరగతులకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు PCM, PCBలను తప్పనిసరిగా చదవాల్సిన అవసరం లేదు.
"కంప్యూటర్ సైన్స్, బయోటెక్నాలజీ, అగ్రికల్చర్, ఇంజినీరింగ్ గ్రాఫిక్స్, బిజినెస్ స్టడీస్, ఐటి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, గణితం, బయాలజీ ఇన్ఫర్మేటిక్స్ ప్రాక్టీస్, టెక్నికల్ వొకేషనల్ సబ్జెక్ట్ (CBSE జాబితా నుండి, మార్కెటింగ్, కన్స్యూమర్ ప్రొటెక్షన్, ఫ్లోరికల్చర్, ఫుడ్ ప్రిపరేషన్ మరియు ఫ్యాషన్ డిజైన్‌తో సహా)" వీటిలో మూడు సబ్జెక్టులతో విద్యార్థులు తమ XII తరగతి బోర్డు పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ద్వారా అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌కు అర్హులని హ్యాండ్‌బుక్ పేర్కొంది.
అయితే, వ్యక్తిగత ఇన్‌స్టిట్యూట్‌లు, విద్యార్థులు ఎంచుకున్న ఇంజనీరింగ్ స్ట్రీమ్‌ను బట్టి ఈ సబ్జెక్టులను చదవకుండానే ప్రవేశం పొందవచ్చో లేదో నిర్ణయించే అధికారం ఉంటుంది. గణితం, ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ వంటి సబ్జెక్టులలో వారి బేసిక్స్ ను మెరుగుపర్చడానికి కామర్స్ లేదా ఆర్ట్ బ్యాగ్రౌండ్ నుండి వచ్చిన విద్యార్థులకు సహాయం చేయడానికి విశ్వవిద్యాలయాలు లేదా సంస్థలు బ్రిడ్జి కోర్సులను అందిస్తాయి.
కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి.