దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై శ్రీరాముడి చిత్రం డిస్ప్లే చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రామ నవమి సందర్భంగా ప్రసిద్ధ ఆకాశహర్మ్యంపై రాముడి చిత్రాన్ని ప్రదర్శించినట్లు చిత్రాన్ని షేర్ చేస్తున్న వారు పేర్కొన్నారు.
నిజ నిర్ధారణ :
న్యూస్‌మీటర్ బృందం వైరల్ చిత్రం మార్ఫింగ్ చేశారని గుర్తించారు.
మేము బుర్జ్ ఖలీఫా మీద రాముడి చిత్రాన్ని ప్రదర్శించడం గురించి కీవర్డ్ సెర్చ్ ను అమలు చేసాము. అయితే విశ్వసనీయ మీడియా సంస్థల నుండి ఎటువంటి వార్తా నివేదికలు కనుగొనలేదు.
మేము బుర్జ్ ఖలీఫా అధికారిక Facebook, Instagram ఖాతాలను కూడా తనిఖీ చేసాము, కానీ అలాంటి పోస్ట్‌లు ఏవీ కనిపించలేదు.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇమేజ్ స్టాక్ వెబ్‌సైట్‌లు iStock, Adobe Stockలో మేము అసలైన చిత్రాన్ని కనుగొన్నాము. అయితే అందులో బుర్జ్ ఖలీఫాపై రాముడి చిత్రాలను చూపించలేదు. అసలు చిత్రం ఫిబ్రవరి 2016లో ప్రచురించారు.
అసలు చిత్రం, మార్ఫింగ్ చేసిన చిత్రానికి మధ్య ఉన్న పోలికను మీరు గమనించవచ్చు.
కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
Credits : Md Mahfooz Alam