FactCheck : వైరల్ వీడియోలో స్మోకీ బిస్కెట్లు తిన్న బాలుడు చనిపోలేదు. వైరల్ వీడియో హైదరాబాద్‌కి చెందినది కాదు

గురుగ్రామ్ డ్రై ఐస్ విషాదం గురించి ప్రజలు ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు. గురుగ్రామ్‌లో డిన్నర్‌ అయ్యాక తీసుకున్న మౌత్‌ ప్రెషనర్‌ ఒక్కసారిగా ఆ వ్యక్తులను ఆస్ప్రతి పాలయ్యేలా చేసింది

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 April 2024 7:24 AM IST
FactCheck : వైరల్ వీడియోలో స్మోకీ బిస్కెట్లు తిన్న బాలుడు చనిపోలేదు. వైరల్ వీడియో హైదరాబాద్‌కి చెందినది కాదు

గురుగ్రామ్ డ్రై ఐస్ విషాదం గురించి ప్రజలు ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు. గురుగ్రామ్‌లో డిన్నర్‌ అయ్యాక తీసుకున్న మౌత్‌ ప్రెషనర్‌ ఒక్కసారిగా ఆ వ్యక్తులను ఆస్ప్రతి పాలయ్యేలా చేసింది. అంకిత్‌ కుమార్‌ అనే వ్యక్తి తన భార్య స్నేహితులతో కలిసి లాఫోరెస్టా కేఫ్‌కి వెళ్లి డిన్నర్‌ చేశారు. చివరిగా మౌత్‌ ఫ్రెషనర్‌గా రూపంలోని డ్రై ఐస్‌ని తీసుకోగానే వారంతా రక్తపు వాంతులు చేసుకున్నారు. నోరు మండటం, నాలుకపై పగుళ్లు వంటివి వచ్చాయి. పోలీసులు రంగంలోకి దిగి బాధితులను ఆస్పత్రికి తరలించారు.

తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఒక బాలుడు స్మోకీ బిస్కెట్‌ను తిన్న తర్వాత బాధతో విలవిలలాడాడు. స్మోకీ ఫుడ్స్‌లో డ్రై ఐస్‌ని తీసుకోవడం వల్ల చాలా రోజుల పాటు బాధపడ్డ బాలుడు ఆ తర్వాత మరణించాడని వీడియోను వైరల్ చేస్తున్నారు.

“Oh, this is dry ice!!! It looks like a place in Telangana or Andhra. The govt has to issue an advisory against the use of dry ice!! It’s plain poison!!Oh my... parents lost a child just like that!! (sic)” అంటూ ఒక ట్విట్టర్ యూజర్ పిల్లాడికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. డ్రై ఐస్ కారణంగా ప్రాణాలు పోయాయంటూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. డ్రై ఐస్ కారణంగా పిల్లాడి ప్రాణం పోయిందని చెబుతున్నారు.

నిజ నిర్ధారణ :

ఆ వీడియో హైదరాబాద్‌కి చెందినది కాదని.. చిన్నారి చనిపోలేదని న్యూస్‌మీటర్ ధృవీకరించింది. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

మేము కీవర్డ్ సెర్చ్ తో మా పరిశోధనను ప్రారంభించాము. ఏప్రిల్ 18, 2024 నాటి కన్నడ మీడియా సంస్థల కథనాలను కనుగొన్నాం. ప్రతిధ్వని, విస్తారా న్యూస్‌లలో సంబంధిత మీడియా నివేదికలను కనుగొన్నాము. నివేదికల ప్రకారం.. ఈ సంఘటన ఏప్రిల్ 17, 2024న కర్ణాటకలోని దావణగెరెలోని PB రోడ్ సమీపంలోని రోబోటిక్ బర్డ్స్ ఎగ్జిబిషన్‌లో జరిగింది. హైదరాబాద్‌లో చోటు చేసుకున్న ఘటన కాదు.


ప్రతిధ్వని నివేదికలో వీడియో స్క్రీన్ షాట్ కూడా ఉంది. “అబ్బాయి స్మోక్ బిస్కెట్ తింటూ స్పృహతప్పి పడిపోయాడు. తల్లిదండ్రులు వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స అనంతరం బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. పొగ బిస్కెట్లపై తల్లిదండ్రులు కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో కార్పొరేషన్ అధికారులు పొగ బిస్కెట్ల విక్రయాలను నిషేధించి సీజ్ చేశారు." అని ఉంది.

ఏప్రిల్ 24, 2024 నాటి ETV భారత్ నివేదికను కూడా మేము చూశాం. “లిక్విడ్ నైట్రోజన్ ఉపయోగించి తయారు చేసిన 'పొగ బిస్కెట్' అని చెప్పుకునే దానిని తిన్నాక ఒక బాలుడు ప్రాణాలు కోల్పోయాడని పేర్కొంటూ కర్ణాటకకు చెందిన ఒక వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో మూర్ఛపోయిన బాలుడికి సకాలంలో వైద్యం అందించిన కారణంగా ప్రాణాలను కాపాడగలిగారని తర్వాత తెలిసింది" అని మేము అందులో చూశాం.

మేము మరొక నివేదికను ISH న్యూస్ కు చెందిన YouTube ఛానెల్‌లో కనుగొన్నాము. కర్నాటకలోని ఒక ఎగ్జిబిషన్‌లో జరిగిన సంఘటన అని ధృవీకరించింది. బాలుడు ప్రాణాలతో ఉన్నాడు. సకాలంలో వైద్యులను సంప్రదించడంతో ఆ పిల్లాడు సురక్షితంగా ఉన్నాడని తేలింది.


ద్రవ నైట్రోజన్ లేదా డ్రై ఐస్ తీసుకోవడం సురక్షితమేనా?

డాక్టర్ ఎన్ భావన, ఒక కన్సల్టెంట్ చర్మవ్యాధి నిపుణులు డ్రై ఐస్ లేదా లిక్విడ్ నైట్రోజన్ తీసుకోవడం వల్ల కలిగే ప్రమాదాల గురించి తెలియజేశారు. " డ్రై ఐస్, లిక్విడ్ నైట్రోజన్ రెండు పదార్థాలు అసాధారణంగా చల్లగా ఉంటాయి. డ్రై ఐస్ -78.5 డిగ్రీల సెల్సియస్ (-109.3 డిగ్రీల ఫారెన్‌హీట్) ఉంటుంది. లిక్విడ్ నైట్రోజన్ మరింత చల్లగా ఉంటుంది. వైద్య రంగంలో క్రయోథెరపీ లాంటి చికిత్సల కోసం ఉపయోగించవచ్చు. నిర్దిష్ట ప్రయోజనాల కోసం మాత్రమే వీటిని ఉపయోగించాలి. డ్రై ఐస్ లేదా లిక్విడ్ నైట్రోజన్‌ని తీసుకోవడం వల్ల నోరులో చాలా చల్లగా ఉంటుంది. అయితే అన్నవాహిక, కడుపుతో సహా ఇతర ప్రాంతాలలో అంతర్గత గాయాలు ఏర్పడతాయి" అని డాక్టర్ భావన తెలిపారు.

వీటిని తీసుకుంటే అన్నవాహిక, కడుపులో తీవ్రమైన కాలిన గాయాలను ఎదుర్కొనాల్సి వస్తుంది. అంతేగాదు తినడంలో శాశ్వత సమస్యలను కలిగిస్తుంది. ఒక్కోసారి వేగవంతమైన రియాక్షన్‌ కారణంగా జీర్ణ అవయవాలను చిధ్రం చేసేలా గ్యాస్‌ ఏర్పడి ఊపిరాడకుండా చేస్తుంది.

Credit : Sunanda Naik

Claim Review:వైరల్ వీడియోలో స్మోకీ బిస్కెట్లు తిన్న బాలుడు చనిపోలేదు. వైరల్ వీడియో హైదరాబాద్‌కి చెందినది కాదు
Claimed By:Social Media User
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:X, Facebook
Claim Fact Check:False
Next Story