Fact Check : రామాయణంలో చెప్పుకున్న 'జటాయు' పక్షి ఇదేనంటూ ప్రచారం..!

Bird in viral video is not Jatayu. ఓ పక్షి పెద్ద.. పెద్ద.. రెక్కలతో ఓ కొండ అంచున నిలబడి ఉండగా.. అందరూ ఫోటోలు

By Medi Samrat  Published on  20 Nov 2020 2:45 AM GMT
Fact Check : రామాయణంలో చెప్పుకున్న జటాయు పక్షి ఇదేనంటూ ప్రచారం..!

ఓ పక్షి పెద్ద.. పెద్ద.. రెక్కలతో ఓ కొండ అంచున నిలబడి ఉండగా.. అందరూ ఫోటోలు తీసుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కేరళ రాష్ట్రంలోని సదయమంగళం అడవుల్లో ఈ పక్షి కనిపించిందంటూ చెబుతూ ఉన్నారు.

"*JATAYU*, the Divine Bird of Ramayana is very rarely seen. Recently the bird was sighted at Sadayamangalam forest in Kerala. I am sure none of you would have seen this majestic Bird in your lifetime, relish its beautiful wingspan," అంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు. ఈ పక్షిని జీవితంలో ఒక్కసారైనా చూడాలని అనుకుంటూ ఉంటారని.. ఇప్పుడు చూసి ఆనందించండంటూ షేర్ చేస్తూ ఉన్నారు.





ఈ వీడియో ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్ లలో వైరల్ అవుతోంది.

నిజ నిర్ధారణ:

కేరళ లోని సదయ మంగళం అడవుల్లో జటాయువు పక్షి కనిపించిందంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.


ఈ వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను సేకరించి 'రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా 2014 లో యూట్యూబ్ లో అప్లోడ్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. `Liberation Condor' అనే పేరుతో ఈ వీడియోను యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. ఆండియన్ కాండోర్ అనే పక్షి ఇది.. దానికి 'సయాని' అనే పేరు పెట్టారు. 2012 లో సయాని ఎగరలేకపోవడంతో దాన్ని చేరదీశారు కాటమార్కా పోలీసులు. బ్యూనోస్ ఎయిర్స్ జూలోనే ఆ పక్షికి సపర్యలు చేసి ఎగిరే స్థితికి తీసుకుని వచ్చారు. ఆ తర్వాత అర్జెంటీనా లోని పోర్టేజులో ప్రాంతంలో విడిచిపెట్టారు.

'Sayani Andean Condor' అనే కీవర్డ్స్ ఆధారంగా సెర్చ్ చేయగా.. Dodo, Animal rescue site, the animalclub సంస్థల్లో ఈ పక్షి గురించి చెప్పుకొచ్చారు. సయాని డిసెంబర్ 2012 సమయంలో అర్జెంటీనా లోని కాటమార్కా ప్రాంతంలో విష ప్రయోగం కారణంగా చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతూ కనిపించింది. స్థానికులు, పోలీసులు ఆ పక్షిని గమనించి బ్యూనోస్ ఎయిర్స్ జూకు తరలించారు. సంవత్సరం పైగా జూలో ట్రీట్మెంట్ ఇచ్చారు. 16 నెలల తర్వాత సయాని బాగుందని గమనించిన అధికారులు.. తిరిగి దాన్ని అడవుల్లో వదిలిపెట్టారు.

మార్చి 28, 2014న సయానిని కాపాడిన వ్యక్తులు, జూ సిబ్బంది కలిసి కాటమార్కాలోని ఓ కొండ మీద నుండి విడిచిపెట్టారు. ఆ వీడియోను అప్పట్లో Silvana Andrade ఫేస్బుక్ పేజీలో అప్లోడ్ చేశారు. సయాని తన పెద్ద.. పెద్ద.. రెక్కలు విప్పి అలా ఎగిరిపోయింది. ఈ వీడియో అప్పటి నుండి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది.

ఈ వీడియోలో ఉన్న పక్షి జటాయు కాదని గతంలో కూడా పలు సంస్థలు స్పష్టం చేశాయి.

https://www.boomlive.in/video-of-andean-condor-passed-off-as-ramayanas-jatayu/

https://www.latestly.com/social-viral/fact-check/fact-check-video-of-jatayu-bird-from-ramayana-spotted-in-kerala-is-fake-know-truth-about-viral-clip-of-andean-condor-1546124.html

https://www.altnews.in/jatayu-mythical-bird-from-ramayana-spotted-in-kerala-no-its-a-condor-from-argentina/

https://timesofindia.indiatimes.com/times-fact-check/news/fake-alert-dont-fall-for-whatsapp-video-saying-jatayu-bird-was-spotted-in-karnataka/articleshow/66067628.cms

కేరళ లోని సదయ మంగళం అడవుల్లో జటాయువు పక్షి కనిపించిందంటూ వైరల్ అవుతున్న పోస్టులు 'పచ్చి అబద్ధం'.


Next Story