Fact Check : 'రైన్ బో హార్పీ ఈగల్' పక్షి కనిపించిందా..?

Bird in viral picture is not `Rainbow Harpy Eagle'. ఓ ఫోటో గ్రాఫ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో ఉన్న

By Medi Samrat  Published on  27 Nov 2020 6:02 AM GMT
Fact Check : రైన్ బో హార్పీ ఈగల్ పక్షి కనిపించిందా..?

ఓ ఫోటో గ్రాఫ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో ఉన్న పక్షి 'Rainbow Harpy Eagle' రైన్ బో హార్పీ ఈగల్ అని చెబుతూ ఉన్నారు. ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. రైన్ బో హార్పీ ఈగల్ పక్షిని చూశామంటూ ఫేస్ బుక్, ట్విట్టర్ లో పోస్టులు పెడుతూ ఉన్నారు.





Rainbow Harpy Eagle

Posted by Fatti narrati realmente accaduti on� Thursday, 22 October 2020



నిజ నిర్ధారణ:

రైన్ బో హార్పీ ఈగల్ పక్షి కనిపించిందంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. ఈ వైరల్ ఫోటోలో ఉన్నది డిజిటల్ ఆర్ట్ అని చెప్పొచ్చు.

వైరల్ అవుతున్న ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా `artstation.com' అనే వెబ్సైట్ లింక్ దొరికింది. అందులో పలువురి ఆర్ట్ వర్క్ ను మనం చూడొచ్చు.

ఈ ఫోటోలో ఉన్న ఆర్ట్ ను సృష్టించింది Godserg_art లేదా సెర్జియో రెమిరెజ్ అనే వ్యక్తి. ఆ ఫోటో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో "Rainbow Harpy Eagle. Hello everyone, hope you guys are having a good weekend. 3rd rainbow animal is the harpy eagle, a very large eagle that lives in the rain-forest and eats monkeys....crazy right. I'm thinking the next animal can be a bull, horse, or bear. Let me know in the comments about what you think of this peace and what animal I should do next. Stay creative guys." అని ఉంది. ఇది ఒక ఆర్ట్ వర్క్.. అందులో ఉన్న పక్షి రైన్ బో హార్పీ .. మూడో రైన్ బో పక్షి హార్పీ ఈగల్ అని చెప్పారు. వర్షారణ్య అడవుల్లో ఈ పక్షులు నివసిస్తూ ఉంటాయి. కోతులను తినగలిగేటంతటి పెద్ద పక్షులు ఇవి.. అని తెలియజేశారు. తర్వాత వేసే బొమ్మ ఎద్దు, గుర్రం లేదా ఎలుగుబంటి అయ్యుండవచ్చు. మీరు కామెంట్ల రూపం లో ఏ బొమ్మ వేయాలో చెప్పాలని కోరారు.

Godserg ఆర్ట్ కు సంబంధించిన సమాచారం ఇంస్టాగ్రామ్ లో కూడా ఉంది. అతడి నిజమైన పేరు సెర్జియో రెమిరెజ్ అని స్పష్టంగా తెలుస్తోంది. అతడు తన ఇంస్టాగ్రామ్ లో ఆ బొమ్మ వేయడానికి పడ్డ శ్రమను టైమ్-లాప్స్ వీడియోలో చూపించాడు.




�ఇంస్టాగ్రామ్ హైలైట్స్ లో కూడా అతడు ఆ ఆర్ట్ వర్క్ ను చూపించారు.

రైన్ బో టైగర్, రైన్ బో వోల్ఫ్ అనే ఆర్ట్ లను కూడా అతడు వేయడం జరిగింది.

హార్పీ ఈగల్ అన్నది చాలా పెద్ద పక్షి.. అయితే ఈ ఆర్ట్ వర్క్ లో ఉన్నంత రంగుల్లో ఆ పక్షి ఉండదు. ఈ పక్షులు కేవలం ఒకే పక్షితో జత కడుతూ ఉంటాయి. రెండు, మూడు దశాబ్దాలు కేవలం ఒకే గూడులో బ్రతికేయగలవు. ఒక్కసారికి ఒక్క పిల్లను మాత్రమే పెంచుతాయి. ఈ పక్షుల జాతిలో ఆడ పక్షి ఏకంగా 24 పౌండ్ల బరువు పెరగగలదు. భూమి మీద ఉన్న గ్రద్దల్లో ఇదే బరువైన, పొడవైనవిగా చెప్పుకోవచ్చు.

https://www.nationalgeographic.com/animals/2020/04/saving-worlds-largest-eagle/

https://animals.fandom.com/wiki/Harpy_Eagle

హార్పీ ఈగల్ పక్షి చాలా అరుదైనది.. కానీ రంగులు రంగుల ఈకలు ఈ పక్షికి ఉండవు.. నలుపు, లేదంటే తెలుపు రంగులో ఈ పక్షి ఉంటుంది. అమెజాన్ వర్షారణ్యాలలో ఈ పక్షులు జీవిస్తూ ఉన్నాయి.

'రైన్ బో హార్పీ ఈగల్' పక్షి కనిపించిందంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'. ఈ ఆర్ట్ ను సృష్టించింది సెర్జియో రెమిరెజ్ అనే ఆర్టిస్ట్.


Claim Review:'రైన్ బో హార్పీ ఈగల్' పక్షి కనిపించిందా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Facebook, Twitter
Claim Fact Check:False
Next Story