దుస్తుల బ్రాండ్ అయిన రామ్‌రాజ్ కాటన్‌కు చెందినదిగా చెప్పుకునే వెబ్‌సైట్ లింక్ వాట్సాప్‌లో వైరల్ అవుతుంది.

కంపెనీ క్రిస్మస్ లక్కీ డ్రాను నిర్వహిస్తోందని, ఇందులో పాల్గొనేవారు రూ. 6000 గెలుచుకునే అవకాశం ఉంటుందని వెబ్‌సైట్ పేర్కొంది.

http://emissiondetached.buzz/ramrajcotton2/tb.php?axhrmjjc1640884313069


"Ramraj Cotton Christmas gift! Through the questionnaire, you will have a chance to get 6000 Rupee (sic)." అంటూ కాంటెస్ట్ కు సంబంధించిన ప్రశ్న ఉంది. ఫోటోలో హీరో విక్టరీ వెంకటేష్ కూడా ఉన్నారు.

నిజ నిర్ధారణ :

వైరల్ లింక్ గుర్తించబడని(ఫేక్) వెబ్‌పేజీకి దారి తీస్తుంది. ఇది రామ్‌రాజ్ కాటన్ యొక్క అధికారిక వెబ్‌సైట్ కాదు. ప్రశ్నాపత్రం స్కామ్ సెటప్ యొక్క నమూనాను అనుసరిస్తోంది. తరచుగా ఇటువంటి అనధికారిక లింక్‌లు వైరల్ అవుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు.

NewsMeter ఫ్యాక్ట్ చెక్ బృందం దాని ప్రామాణికతను తనిఖీ చేయడానికి వైరల్ లింక్‌పై క్లిక్ చేసి, వెబ్‌పేజీ బూటకమని గుర్తించింది. ప్రశ్నలకు సమాధానమిచ్చిన తర్వాత, వినియోగదారు బహుమతి పెట్టెను ఎంచుకోవడానికి నిర్దేశించబడతారు. దాని ద్వారా విజేత ఎంపిక చేయబడతారు.

NewsMeter అనేక ట్రయల్స్ నిర్వహించింది. రెండవ అవకాశంలో విజేత ఎంపిక చేయబడటాన్ని మేము గమనించాము. ప్రతి ఒక్కరూ ప్రతిసారీ గెలుపొందడంతో లింక్ నకిలీదని ఇది సూచిస్తుంది.

వెబ్‌పేజీ వినియోగదారు యొక్క IP చిరునామాను కూడా నిల్వ చేస్తుంది. Whatsapp గ్రూప్ లలో సందేశాన్ని షేర్ చేయమని వినియోగదారులని అడుగుతుంది. ఇది ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌ల నుండి సమాచారాన్ని హ్యాక్ చేయడానికి, దొంగిలించడానికి ఉపయోగించే సాధారణ పద్ధతి.

రామ్‌రాజ్ కాటన్ సంస్థ క్రిస్మస్ లక్కీ డ్రాను నిర్వహించడం గురించి ఎలాంటి ప్రకటనలు చేయలేదు. డేటా చోరీకి దారితీసే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ అలాంటి వెబ్‌సైట్‌లను క్లిక్ చేయడం, అందులో డేటాను ఎంటర్ చేయడం మానుకోవాలని సూచిస్తున్నాము.

వైరల్ అవుతున్న లింక్ బూటకమని స్పష్టం చేస్తున్నాము.


Claim Review :   FactCheck: రామ్ రాజ్ కాటన్ సంస్థ 6000 రూపాయలు ఇస్తోందా..?
Claimed By :  Social Media Users
Fact Check :  False

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story