Fact Check : దుబాయ్ లో కృత్రిమ వర్షం.. డ్రోన్ లతో నిజమేనా..?

Beat the Heat with Artificial Showers in Pure Dubai Style. దుబాయ్ కృత్రిమంగా వర్షాన్ని సృష్టించిందనే కథనాలు సామాజిక మాధ్యమాల్లో

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 29 July 2021 2:33 PM IST

Fact Check : దుబాయ్ లో కృత్రిమ వర్షం.. డ్రోన్ లతో నిజమేనా..?
దుబాయ్ కృత్రిమంగా వర్షాన్ని సృష్టించిందనే కథనాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. ఆ దేశంలో వేడిని తట్టుకోడానికి ఇలా ప్రభుత్వమే చేయించిందని చెబుతూ ఉన్నారు.


టెక్నాలజీని ఉపయోగించి డ్రోన్ల సహాయంతో కృత్రిమంగా వర్షాన్ని సృష్టించారని పలువురు పోస్టులు పెట్టారు. అలా చేసి వేడిని తగ్గించారని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వెలిశాయి.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న కథనాలు నిజమే..!

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలను తగ్గించడానికి అధికారులు డ్రోన్లను ఉపయోగించి వర్షం కురిపించారు.

యూఏఈలోని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీ నిపుణులు డ్రోన్ల సాయంతో క్లౌడ్ సీడింగ్ ప్రక్రియ చేపట్టి వర్షాన్ని కురిపించారు. గరిష్ట ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కలిగేలా కృత్రిమ వర్షపాతం నమోదయ్యేలా కొత్త ఆవిష్కరణను శాస్త్రవేత్తలు ప్రారంభించారు. డ్రోన్లతో మేఘాలను విద్యుత్‌ ఆవేశానికి గురిచేసి కృత్రిమంగా వర్షాలు కురిసేలా శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం విజయవంతం అయ్యింది ఈ టెక్నాలజీ సాయంతో మేఘాలను విద్యుదావేశానికి గురిచేస్తారు. దాంతో మేఘాలు కరిగి, అధిక వర్షపాతాన్నిస్తాయి. ఈ డ్రోన్ క్లౌడింగ్ సీడింగ్ ప్రక్రియతో దుబాయ్ నగరంలో కృత్రిమ వర్షాలు కురిపించారు.

దీనికి సంబంధించిన వీడియోను అధికారులు ట్విట్టర్ లో పంచుకున్నారు. క్లౌడ్‌ సీడింగ్‌ పద్దతిలో సిల్వర్‌ అయోడైడ్‌ లాంటి రసాయనాలను మేఘాల్లోకి విస్తరింపజేయడంతో కృత్రిమ వర్షపాతాన్ని కలిగించేందుకు ప్రయత్నిస్తారు. క్లౌడ్‌ సీడింగ్‌ పద్దతిను 1940లోనే కనుగొన్నారు. అనేక దేశాలు ఈ పద్దతినుపయోగించి ఇప్పటికే కృత్రిమ వర్షాలు కురిపిస్తున్నాయి.

దుబాయ్‌లోని ఓ హైవేపై వ‌ర్షం కురుస్తున్న వీడియో వైర‌ల్‌గా మారింది. కొన్నేళ్లుగా ఎయిర్‌క్రాఫ్ట్‌ను పంపించి క్లౌడ్ సీడింగ్ ద్వారానే యూఏఈ కృత్రిమ వ‌ర్షాలు కురిపిస్తోంది. అయితే ఈ తాజా వ‌ర్షాలు మాత్రం డ్రోన్ల సాయంతో సాధ్య‌మైన‌ట్లు తెలుస్తోంది.

టెక్నాలజీ సాయంతో దుబాయ్ లో కృత్రిమ వర్షం సాధ్యమైందంటూ వైరల్ అవుతున్న కథనాలు నిజమే.


Claim Review:దుబాయ్ లో కృత్రిమ వర్షం.. డ్రోన్ లతో నిజమేనా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Twitter
Claim Fact Check:True
Next Story