బీబీసీ మీడియాకు చెందిన వెబ్సైట్ లో గోమూత్రం కారణంగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని ఉన్న వార్తకు సంబంధించిన స్క్రీన్ షాట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.


`Black fungus: Indian scientist find link with cow urine, 9,000 cases of rare infection' అంటూ ఆర్టికల్ హెడ్ లైన్ ఉండడాన్ని గమనించవచ్చు. బ్లాక్ ఫంగస్ కు.. గోమూత్రానికి ఏదో లింక్ ఉందని భావించిన నెటిజన్లు ఈ స్క్రీన్ షాట్ ను సోషల్ మీడియాలో షేర్ చేయడం మొదలుపెట్టారు.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న హెడ్ లైన్ కు సంబంధించి సెర్చ్ చేయగా బీబీసీ న్యూస్ వెబ్ సైట్ లో ఎటువంటి ఆర్టికల్ కూడా కనిపించలేదు. ఇక ఆర్టికల్ లో కూడా ఎన్నో తప్పులను గుర్తించవచ్చు. ఎన్నో వ్యాకరణ దోషాలు కూడా ఉండడం స్పష్టంగా తెలుస్తోంది.


వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్ లో ఉన్న ఆర్టికల్ ను, బీబీసీ సైట్ లో సాధారణంగా ఉండే ఆర్టికల్ ను పోల్చి చూడగా.. ఆర్టికల్ ఫార్మాటింగ్ లో కూడా తప్పులను చూడొచ్చు. దీన్ని బట్టి ఈ వైరల్ పోస్టును మార్ఫింగ్ చేసినట్లుగా గమనించవచ్చు.


అలాంటి ఆర్టికల్ నే 'సౌతిక్ బిస్వాస్' రాశారు.

'Black fungus: India reports nearly 9,000 cases of a rare infection.' అంటూ సౌతిక్ బిస్వాస్ ఆర్టికల్ ను రాశారు. ఆయన బ్లాక్ ఫంగస్ కేసుల మీద ఆర్టికల్ ను రాశారు కానీ.. గోమూత్రానికి బ్లాక్ ఫంగస్ కు లింక్ పెడుతూ ఆర్టికల్ ను రాయలేదు.

ఇక ట్విట్టర్ యూజర్ ఒకరు ఈ ఆర్టికల్ మీరే రాశారా అంటూ వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్ గురించి అడగగా.. ఆయన అదొక ఫేక్ న్యూస్ అంటూ చెప్పుకొచ్చారు. తాను రాసిన ఆర్టికల్ కు సంబంధించిన సమాచారాన్ని నెటిజన్ తో షేర్ చేసుకున్నారు.

గో మూత్రం కారణంగా బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయని బీబీసీలో ఆర్టికల్ వచ్చిందంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.
Claim Review :   గో మూత్రం కారణంగా బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయని బీబీసీలో ఆర్టికల్ వచ్చిందా..?
Claimed By :  Social Media Users
Fact Check :  False

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story