ఓ పార్కులో చిన్న చిన్న జిరాఫీలు పరిగెడుతూ ఉన్న వీడియో వైరల్ అవుతూ ఉన్నాయి. మొత్తం 15 సెకెండ్ల నిడివి ఉన్న ఆ వీడియో వైరల్ అవుతూ ఉంది. నిజమైన జిరాఫీలు ఇవి అని పలువురు భావిస్తూ ఉన్నారు.
ఆర్.పి.జి. గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా కూడా ఈ వీడియోను ట్వీట్ చేశారు. "I didn't know baby giraffes look like this- exact miniature copy! .... so cute !" అంటూ ఆయన పోస్టు పెట్టారు. చిన్న చిన్న జిరాఫీలు ఇలా ఉంటాయని తనకు తెలియదని ఆయన అన్నారు. ఎంతో ముద్దుగా ఉన్నాయి.. ఈ చిన్న జిరాఫీలు అని ఆయన చెప్పుకొచ్చారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న వీడియో నిజమైనది కాదు.. ఇది 3డీ యానిమేషన్ లో భాగంగా రూపొందించింది.
న్యూస్ మీటర్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఆగష్టు 2020న ఇంస్టాగ్రామ్ లో వీడియోను పోస్టు చేశారు. అదే అకౌంట్ లో సీతాకోక చిలుకలు, కుక్కలు, తాబేళ్లు మొదలైన వాటికి సంబంధించిన వీడియోలను 3డీ యానిమేషన్ లో రూపొందించారు సదరు యానిమేషన్ ఆర్టిస్ట్.
వెర్నాన్ జేమ్స్ మనాలపాజ్ అకౌంట్ లో ఈ వీడియోలు ఉన్నాయి. 'షార్ట్ మేజికల్ వీడియోలు' ఇవన్నీ అని బయో ద్వారా తెలుస్తోంది. Vernon James Manlapaz గురించి సెర్చ్ చేయగా ఆయనకు యానిమేషన్ లో కొన్ని సంవత్సరాల అనుభవం ఉందని తెలుస్తోంది. గతంలో కూడా పలు వీడియోలను, విజువల్ ఎఫెక్ట్స్ ను ఆయన రూపొందించనట్లు స్పష్టమవుతోంది.
స్పెయిన్ కు చెందిన మేగజైన్ కూడా ఈ వీడియోను గతంలో ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. వెర్నాన్ జేమ్స్ మనాలపాజ్ కు వీడియో క్రెడిట్స్ ను ఇచ్చారు.
వెర్నాన్ జేమ్స్ మనాలపాజ్ 3డీ యానిమేషన్ ద్వారా అచ్చం నిజంగానే ఉన్నాయనే అనుభూతిని కల్పిస్తూ ఉంటాడు. ఆయన రూపొందించిన వీడియోలు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందికి నచ్చాయి. ఓ ఊహాలోకాన్ని ఆయన తన వీడియోల ద్వారా సృష్టిస్తూ ఉంటాడు.
వైరల్ అవుతున్న చిన్న చిన్న జిరాఫీలు ఉన్న వీడియో నిజమైనది కాదు. 3డీ యానిమేషన్ ద్వారా రూపొందించినది. నిజమైన చిన్న జిరాఫీలు అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.