Fact Check : బాబా రామ్ దేవ్, పతంజలి బాలకృష్ణ ఆసుపత్రి పాలయ్యారంటూ వైరల్ అవుతున్న పోస్టులు..!
Baba Ramdev Balkrishna are hale and hearty viral claims are false. పతంజలి ఎండీ బాలకృష్ణ కరోనా బారిన పడి ఆసుపత్రి పాలయ్యాడని..
By Medi Samrat Published on 15 May 2021 5:26 AM GMTపతంజలి ఎండీ బాలకృష్ణ కరోనా బారిన పడి ఆసుపత్రి పాలయ్యాడని.. రామ్ దేవ్ బాబా గోమూత్రం అధికంగా సేవించి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారంటూ.. కొన్ని ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ ఉండడాన్ని గమనించవచ్చు.
"जिस कोरोनिल को सरकार के मंत्रीगण कोरोना की दवा बताकर बेच रहे थे उस कोरोनिल ने अपने मालिक का ही साथ नहीं दिया.
बालकृष्ण जी हैं. ऑक्सीजन ले रहे हैं एम्स में. देखिए अब आप ये मत पूछिएगा कि एम्स में उन्हें कैसे बेड मिल गया. वो तो न संतरी हैं और न मंत्री हैं. लेकिन याद रहे कि वो आम आदमी भी नहीं हैं.
कौन कह रहा था कि सिस्टम फेल है. ये सिस्टम है जो काम कर रहा है. सिस्टम जिनका होता है उनके लिए बेड ऑक्सीजन सब मिल जाता है. सिस्टम बालकृष्ण जैसों का है. वो आपको कोरोनिल देकर मार देंगे और खुद ऑक्सीजन के साथ बेड ले लेंगे." ముఖ్యంగా హిందీలో పలువురు ఈ పోస్టులను పెట్టారు.
'కరోనా మహమ్మారి చికిత్సకు 'కొరోనిల్' సాయపడుతుందని ఏకంగా కేంద్ర మంత్రులే చెప్పారని.. ఆ కొరోనిల్ ను కనిపెట్టిన సంస్థ ఎండీ బాలకృష్ణ కరోనా బారిన పడి ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఆయనకేమో ఆక్సిజన్ ఉన్న బెడ్ లభించింది.. సాధారణ ప్రజలకు లభించడం లేదు. మనదేశంలో వ్యవస్థ ఇలాగే పని చేస్తూ ఉంది. ఆక్సిజన్, బెడ్.. లాంటివి ఇలాంటి వాళ్లకు దొరుకుతూ ఉంటాయి. కానీ ఇతరులకు మాత్రం దక్కడం లేదు. ఇలాంటి వాళ్లు మనల్ని కొరోనిల్ వేసుకోమని చెప్తారు.. వెళ్ళేమో ఆసుపత్రుల్లో బెడ్లను సంపాదించుకుంటారు' అంటూ బెడ్ మీద బాలకృష్ణ ఉన్న ఫోటోను వైరల్ చేస్తున్నారు.
बाबा रामदेव कह रहा है की कोरोना के मरीजों को अस्पताल की ऑक्सीजन की जरुरत ही नहीं है, हवा से ऑक्सीजन लो। उसने अपने और पतंजलि के मालिक बालकृष्ण को क्यों नहीं समझाया ये। pic.twitter.com/LZ28rv7zPE
— Chaudhary Raj Singh (@Ch_Raj_Singh) May 8, 2021
యోగా గురు రామ్ దేవ్ బాబా ఆసుపత్రి బెడ్ మీద ఉన్న ఫోటో కూడా వైరల్ అవుతూ ఉంది. గోమూత్రాన్ని అధికంగా తాగడం వలన రామ్ దేవ్ బాబా ఆసుపత్రి పాలయ్యారంటూ పోస్టులు వెలుస్తూ ఉన్నాయి.
Archive links:
https://web.archive.org/save/https://www.facebook.com/firoz.alam.5458/posts/2277155065750472
https://web.archive.org/save/https://www.facebook.com/lifeokay.lk/posts/1095009057517736
నిజ నిర్ధారణ:
బాబా రామ్ దేవ్, బాల కృష్ణ కు సంబంధించి వైరల్ అవుతున్న ఈ పోస్టులు చాలా పాతవి. పతంజలి ఎండీ బాలకృష్ణ కరోనా కారణంగా ఆసుపత్రి పాలవ్వలేదు. రామ్ దేవ్ బాబా గోమూత్రాన్ని అధికంగా సేవించడం వలన ఆసుపత్రిలో చికిత్స పొందడం లేదు.
వైరల్ అవుతున్న ఫోటోకు సంబంధించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. బాలకృష్ణ, పతంజలి ఎండీ ఆసుపత్రిలో ఉన్న ఫోటో 2019 సంవత్సరానికి చెందినది. రిపోర్టుల ఆధారంగా ఆగష్టు 2019లో బాలకృష్ణ అనారోగ్య కారణాల వలన రిషీకేశ్ లో ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చేరారు. అప్పట్లో ఆయనకు చెస్ట్ పెయిన్ రావడంతో వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. అయితే బాలకృష్ణకు వచ్చింది హార్ట్ అటాక్ కాదని.. ఫుడ్ పాయిజనింగ్ అంటూ వివరణ ఇచ్చారు.
23/8/ 2019న ఎయిమ్స్ సంస్థ కూడా ఆచార్య బాలకృష్ణ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది. రిషికేష్ లోని ఎయిమ్స్ లోకి సాయంత్రం 4:15 సమయంలో తీసుకుని వచ్చారని తెలిపింది.
అంతేకానీ కరోనా కారణంగా బాలకృష్ణ ఆసుపత్రిలో చేరారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.
ఇక బాబా రామ్ దేవ్ కు సంబంధించిన ఫోటోను గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఆ ఫోటో 2011 సంవత్సరానికి చెందిందని తెలిసింది. అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతికి నిరసనగా 'ఆమరణ నిరాహార దీక్ష' చేశారు బాబా రామ్ దేవ్. అప్పుడు ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించిన ఫోటో ఇది.
https://www.bbc.com/news/world-south-asia-13725837?print=true
రామ్ దేవ్ బాబా ఎనిమిది రోజుల పాటూ నిరాహార దీక్ష చేశారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ ఉండడంతో దీక్ష విరమించడానికి పోలీసులు ప్రయత్నించారు. డెహ్రాడూన్ లోని హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆసుపత్రిలో ఉన్నప్పటి ఫోటో ఇది.
ఈ వైరల్ అవుతున్న ఫోటోలకు.. పోస్టులకు కోవిడ్ తో ఎటువంటి సంబంధం లేదు. వైరల్ అవుతున్న పోస్టులు 'పచ్చి అబద్ధం'.