విమానాశ్రయంలో బహిరంగంగా మూత్ర విసర్జన చేసినందుకు ఓ వ్యక్తిని అరెస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడింది.

"షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ఎయిర్‌పోర్ట్‌లో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడు. పబ్లిక్‌గా మూత్ర విసర్జన చేశాడు" అనే క్యాప్షన్ తో వీడియోను వైరల్ చేస్తూ ఉన్నారు.

"షారూక్ ఖాన్ గాడి కొడుకు డ్రక్స్ కేసులో దోరికితే ఏడ్చిన ముండా మొహాలు . ఇప్పుడు ఏయిర్ పోర్ట్ లోనే డ్రక్స్ తీసుకుని దోరికాడు పబ్లిక్ గా మూత్రం పోషాడు ఇప్పుడు ఏడవండి ." అంటూ బూతులు తిడుతూ కొందరు పోస్టులు పెట్టారు.

నిజ నిర్ధారణ :

వైరల్ అవుతున్న వీడియోలకు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు ఎటువంటి సంబంధం లేదు.

ఈ వీడియో పది సంవత్సరాల కిందట జరిగిన ఓ సంఘటనకు సంబంధించినది. ఆ వీడియోలో పబ్లిక్‌గా మూత్ర విసర్జన చేసింది ఆర్యన్ ఖాన్ కాదు. Googleలో కీవర్డ్ సెర్చ్ చేయగా.. 2013లో ఇలాంటి దృశ్యాలను నివేదించిన అనేక వార్తా కథనాలను చూశాము.

ట్విలైట్ చిత్రంలో నటించిన కెనడియన్ నటుడు బ్రోన్సన్ పెల్లెటియర్, వీడియోలో బహిరంగంగా మూత్ర విసర్జన చేయడం కనిపించింది. డిసెంబరు 2012లో లాస్ ఏంజెల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. మద్యం మత్తులో బహిరంగంగా మూత్ర విసర్జన చేసినందుకు అరెస్టయ్యాడు.

https://www.tmz.com/2013/02/22/twilight-bronson-pelletier-airport-pee-urinate-video-sentenced-probation/

https://www.dailymail.co.uk/tvshowbiz/article-2283148/Twilight-actor-Bronson-Pelletier-handed-probation-caught-video-urinating-public-Los-Angeles-airport.html

https://www.buzzfeed.com/whitneyjefferson/video-of-drunk-dude-peeing-in-airport-is-actually

కోర్టు బ్రోన్సన్ పెల్లెటియర్‌ను దోషిగా నిర్ధారించింది. అతనికి రెండేళ్ల ప్రొబేషన్ శిక్ష విధించింది. ఈ ఘటనపై పలు మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి.

https://www.tmz.com/2012/12/18/twilight-bronson-pelletier-arrested-peeing-drunk-airport/

https://www.huffpost.com/entry/bronson-pelletier-arrested-twilight-drunken-peeing-airport_n_2325126

https://www.dailymail.co.uk/tvshowbiz/article-2250238/Twilight-actor-Bronson-Pelletier-arrested-LAX-airport-urinating-public-drunk--week-arrest-cocaine-meth-possession.html

https://www.tmz.com/2012/12/18/twilight-bronson-pelletier-arrested-peeing-drunk-airport/

ఈ ఘటనకు ఆర్యన్ ఖాన్ కు ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి వైరల్ పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.


Claim Review :   పబ్లిక్ లో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ మూత్ర విసర్జన చేశాడా..?
Claimed By :  Social Media Users
Fact Check :  False

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story