FactCheck : అల్లం నూనెను బొడ్డుపై పూయడం వల్ల బరువు తగ్గుతామా..?

Applying ginger oil to belly will not reduce fat; viral claims are false. బెల్లీ బటన్‌పై అల్లం నూనెను ఉపయోగించడం వల్ల కొవ్వు తగ్గుతుందని.. బరువు తగ్గడంలో సహాయపడుతుందని

By Medi Samrat  Published on  13 Aug 2022 2:45 PM GMT
FactCheck : అల్లం నూనెను బొడ్డుపై పూయడం వల్ల బరువు తగ్గుతామా..?

బెల్లీ బటన్‌పై అల్లం నూనెను ఉపయోగించడం వల్ల కొవ్వు తగ్గుతుందని.. బరువు తగ్గడంలో సహాయపడుతుందని పేర్కొంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడుతోంది.


అల్లం నూనెను బొడ్డుపై అప్లై చేయడం లేదా రుద్దడం వల్ల కేవలం 30 రోజుల్లో కొవ్వు కరిగిపోతుందని వీడియోలో పేర్కొన్నారు.

నిజ నిర్ధారణ :

దీని గురించిన అధ్యయనాలు, పరిశోధనలను కనుగొనడానికి NewsMeter Googleలో కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించింది. అల్లం నూనెతో శరీరం లోని కొవ్వును తగ్గించే విధానం ఉందని చెప్పే ఎటువంటి ఆధారాలు కనుగొనబడలేదు.

బరువు తగ్గడానికి అల్లం నీటిని తీసుకోవడం కూడా ఒక విధంగా ఉపయోగపడుతుందని నిరూపించే ఒక అధ్యయనాన్ని కనుగొన్నాము. బరువు తగ్గడంలో సహాయపడే ఒక మూలవస్తువుగా అల్లాన్ని గుర్తించారు. అల్లాన్ని.. యాంటీఆక్సిడెంట్, బ్లడ్-షుగర్ స్టెబిలైజింగ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలతో పాటు తీసుకున్నప్పుడు బరువు తగ్గడానికి మంచి తోడ్పాటును ఇస్తుంది. కానీ అల్లం మాత్రమే బరువు తగ్గుదలకు కారణమవ్వదు. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం కారణంగా బరువు తగ్గవచ్చు.

https://www.healthline.com/health/ginger-for-weight-loss#summary

NewsMeter Google Scholarలో కీవర్డ్ సెర్చ్ చేసి, ఎలుకలపై చేసిన అధ్యయనంలో 'అల్లం నీరు శరీర బరువును తగ్గిస్తుంది ఎలుకలలో శక్తిని పెంపొందిస్తుంది ' అని తేలింది.

https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC7023345/

పోషకాహార నిపుణురాలు సుజాత స్టీఫెన్ RD, ముఖ్య పోషకాహార నిపుణులు , యశోద హాస్పిటల్స్

అల్లం యాంటీ ఇన్ఫ్లమేటరీ.. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది జీవక్రియ మెరుగుదలలో కూడా సహాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గడంలో ఒక విధంగా సహాయపడుతుంది. కానీ ఈ నూనెను బాహ్య శరీరంపై పూసుకోవడం వలన బరువు తగ్గడం నిజం కాకపోవచ్చు. అటువంటి ఉత్పత్తులతో బరువు తగ్గుతామని చెప్పడం మార్కెటింగ్ వ్యూహంలో ఒక భాగం. ఎవరైనా బరువు తగ్గాలంటే సరైన ఆహారం, మంచి జీవనశైలి ముఖ్యం. తక్షణమే బరువు తగ్గడం అనేది నిజం కాదు.

డాక్టర్ జహీరున్నీషా, కన్సల్టెంట్ న్యూట్రిషనిస్ట్, రెనోవా హాస్పిటల్స్

వంటల్లో రోజూ అల్లం ఉపయోగించడం వల్ల కడుపులో మంట తగ్గుతుంది. అల్లంలో జింజెరోల్స్ & స్కూల్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్ లక్షణాలు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ నియంత్రణలో సహాయపడతాయి. అల్లం నూనె పూసుకుంటే బరువు తగ్గడంలో మీకు సహాయం చేయదు. అందుకు బదులుగా రెగ్యులర్‌గా తీసుకునే ఆహారంలో అల్లం ముక్కను తీసుకోవడం మంచిది. మంచి శారీరక శ్రమ, సరైన ఆహారం తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు.

డాక్టర్ స్పందనకనపర్తి, కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్, రెనోవా హాస్పిటల్స్

ఈ విధంగా బరువు తగ్గుతామని సమర్థించే శాస్త్రీయ ఆధారాలు లేవు. అల్లం యాంటీ ఇన్‌ఫ్లమేటరీ & యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉన్నట్లు తెలిసినప్పటికీ, ఇది మన శరీరంలోని విషపూరిత కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. బొడ్డు మీద కేవలం ఆయిల్ పూయడం ద్వారా శరీర బరువును తగ్గించడమన్నది నిజం కాదు. ఊబకాయం తీవ్రమైన ఆరోగ్య సమస్య. బరువు త్వరగా తగ్గాలని అనుకోకండి.. అది వెంటనే జరగాల్సిన అవసరం లేదు. బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడానికి మంచి ఆహారం, వ్యాయామం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.

అల్లం నూనెను బొడ్డుపై అప్లై చేయడం వల్ల బరువు తగ్గలేము. కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.


Claim Review:అల్లం నూనెను బొడ్డుపై పూయడం వల్ల బరువు తగ్గుతామా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media Users
Claim Fact Check:False
Next Story